Assembly Bypoll Results: లోక్‌సభ ఎన్నికల తర్వాత.. దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగగా.. ఈరోజు ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో ఎన్డీయే (NDA) కూటమికి బిగ్ షాక్ తగిలింది. 13 స్థానాల్లో పది స్థానల్లో ఇండియా కూటమి (INDIA) విజయం సాధించింది. బీజేపీ కేవలం రెండు స్థానాలతోనే సరిపెట్టుకుంది. మరో స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి గెలిచారు.
పశ్చిమ బెంగాల్‌లో 4, హిమాచల్‌ప్రదేశ్‌లో 3, ఉత్తరాఖండ్‌లో 2, పంజాబ్, తమిళనాడు, బిహార్, మధ్యప్రదేశ్‌లో ఒక్కో స్థానానికి జులై 10 ఉప ఎన్నికలు జరిగాయి. శనివారం కౌంటింగ్ చేపట్టి ఫలితాలు ప్రకటించారు. పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ నాలగు స్థానాల్లో గెలిచి క్లీన్‌స్వీప్ చేసింది. ఉత్తరాఖండ్‌లో రెండు స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది. పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి మోహిందర్ భగత్ విజయం సాధించారు. తమిళనాడులో డీఎంకే, హిమాచల్‌ప్రదేశ్‌లో రెండు కాంగ్రెస్, ఒకటి బీజేపీ, మధ్యప్రదేశ్‌లో బీజేపీ గెలిచాయి. బీహార్‌లోని రూపాలీలో ఇండిపెండెంట్ అభ్యర్థి గెలిచారు. అయితే ఎన్నికలు జరిగిన ఏడు రాష్ట్రాల్లో.. నాలుగు రాష్ట్రాల్లో ఇండియా కూటమి అధికారంలో ఉండగా.. మరో మూడుచోట్ల ఎన్డీయే సర్కార్ అధికారంలో ఉంది.
Also Read: మధ్యంతర బడ్జెట్ లో ఇచ్చిన హామీ ఇప్పుడు ఆర్ధికమంత్రి నెరవేరుస్తారా?