India vs Afghanistan 3rd T20: చాలా రోజుల తర్వా ఫ్యాన్స్ కు సూపర్ ట్రీట్ అందించింది నిన్నటి ఆఫ్ఘాన్-భారత్ టీ20 మ్యాచ్. 212 పరుగులు చేసి ఇక మ్యాచ్ మాదే...తిరుగులేదు అనుకున్న సమయంలో ఆఫ్ఘాన్ మేమేమీ తక్కువ తినలేదంటూ విజృంభించింది. పోనీ అక్కడితో ఆగిందా అంటే అదీ లేదు...సూర్ ఓవర్ (Super Over) వరకు వెళ్ళారు. సరే దానితో అయినా ఫలితం తేలుతుంది. టీమ్ ఇండియా (Team India) గెలుస్తుంది అని ఆశపడ్డారు. అబ్బే...అలా జరిగితే డబుల్ మజా ఎలా వస్తుంది. సూపర్ ఓవర్ లో ఫలితం తేలకపోయే సరికి డబుల్ సూపర్ ఓవర్ కూడా ఆడారు. చివరకు అక్కడ అందులో టీమ్ ఇండియా విజయం సాధించింది. భారత జట్టు గెలిచి...ఆప్ఘాన్ జట్టు పోరాడి ఓడి మనసులను గెలుచుకున్నారు.
సీరీస్ క్లీన్ స్వీప్...
టీ20 ప్రపంచకప్ ఇంకొన్ని రోజుల్లో ఉందనగా జరిగిన సీరీస్ ఇది. టీమి ఇండియా, ఆఫ్ఘాన్‌లు మూడు మ్యాచ్‌ల టీ20 సీరీస్ ఆడుతున్నాయి. ఇందులో ఇప్పటికే భారత జట్టు రెండు గెలిచి సీరీస్‌ను సొంతం చేసుకున్నాయి. ఇక మూడో మ్యాచ్ నిన్న బెంగళూరులో (Bengaluru) జరిగింది. క్లీస్ స్వీప్ చేసి రికార్డ్ కొట్టాలని టీమ్ ఇండియా...ఒక్క అయినా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని ఆఫ్ఘాన్ మ్యాచ్ ఆడాయి. ఇద్దరిలోనూ నిన్న ఆ కసి కనిపించింది. అందుకే 212 భారీ స్కోరు వచ్చినా పోరాడింది ఆఫ్ఘాన్. మేము వదలం అంటూ టీమ్ ఇండియా కూడా సాధించి గెలిచింది. తొలి సూపర్ ఓవర్ ఓవర్లో రెండు జట్లు 16 పరుగులతో సమంగా నిలిచాయి. రెండో సూపర్ ఓవర్‌లో ముందు భారత్ 11 పరుగులు చేయగా... అఫ్గాన్ 1 పరుగుకే 2 వికెట్లు కోల్పోయింది. నిబంధనల ప్రకారం ‘సూపర్ ఓవర్’లో రెండు వికెట్లు పడితే ఇన్నింగ్స్ ముగిసినట్టే కావడంతో భారత విజయం ఖరారైంది.
Also Read: రోహిత్ దెబ్బకు పాండ్యా ప్యూజులౌట్.. ఇక దుకాణం సర్దుకోవాల్సిందే!
రోహిత్ ఆ మజాకానా...
అంతకు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) విశ్వరూపం చూపించాడు. తన బ్యాట్‌లో పవర్ తగ్గిందని మాట్లాడిన వారికి అదే బ్యాట్‌తో నోరు మూయించాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు నిలబడి, పోరాడి.. కిందపడ్డా లేచి పరుగెత్తేవాడే నాయకుడు. రోహిత్ శర్మ అలాంటి నాయకుడే.. ఈ విషయం గతంలో అనేకసార్లు ప్రూవ్ అయ్యింది. తాజాగా అఫ్ఘానిస్థాన్‌పై చిన్నస్వామి వేదికగా జరిగిన మూడో టీ20లో రోహిత్ శర్మ తన విలువేంటో బీసీసీఐకు కళ్లకు కట్టినట్టు చూపించాడు. సెంచరీతో చెలరేగాడు. రోహిత్ శర్మకు తోడుగా నయా ఫినీషర్ రింకూ సింగ్ (Rinku Singh) రెచ్చిపోవడంతో భారత్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 212 రన్స్ చేసింది.
అసలు టీమ్ ఇండియాకు ఆరంభంలోనే షాకులు తగిలాయి. వరుసగా నాలుగు వికెట్లు పడిపోయాయి. కేవలం 4.3 ఓవర్లలో 22 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లోకి దూరిపోయిన టీమ్ ఇండియాను ఒంటి చేత్తో పైకి లేపాడు కెప్టెన్ రోహిత్ శర్మ. ఫినీషర్ రింకూ సింగ్‌తో కలిసి రోహిత్ శర్మ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యతను తీసుకున్నాడు. ఇద్దరు మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడుతూ స్కోరు బోర్డును కదిలించారు. చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ బ్యాటింగ్ చేశారు. ముఖ్యంగా రోహిత్ శర్మ తన టాలెంట్ ఏంటో ప్రపంచానికి మరోసారి చూపించాడు. ముందుగా హాఫ్ సెంచరీ.. తర్వాత తనదైన శైలిలో సెంచరీతో చెలరేగాడు. మొత్తంగా 69 బంతుల్లో 121 రన్స్ చేసిన రోహిత్ శర్మ ఖాతాలో 8 సిక్సర్లు, 11 ఫోర్లు ఉన్నాయి. అంతర్జాతీయ టీ20 చరిత్రలో 5 సెంచరీలు చేసిన ఏకైక ప్లేయర్ రోహిత్ శర్మనే. అటు రింకూసింగ్ సైతం చివరిలో చెలరేగడంతో భారత్ 200 పరుగులు దాటింది. 39 బంతుల్లోనే 69 పరుగులు చేశాడు రింకూ. చివరి ఓవర్‌లో ఇద్దరు కలిపి 36 పరుగులు పిండుకున్నారు. ఓ నో బాల్ పడింది.
India vs Afghanistan స్కోరు వివరాలు...
భారత్ ఇన్నింగ్స్: యశస్వి (సి) నబీ (బి) ఫరీద్ 4; రోహిత్ (నాటౌట్) 121; కోహ్లి (సి) ఇబ్రహీమ్ (బి) ఫరీద్ 0; దూబే (సి) గుర్బాజ్ (బి) అజ్మతుల్లా 1; సామ్సన్ (సి) నబీ (బి) ఫరీద్ 0; రింకూ (నాటౌట్) 69; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 212.
వికెట్ల పతనం: 1–18, 2–18, 3–21, 4–22.
బౌలింగ్: ఫరీద్ 4–0–20–3, అజ్మతుల్లా 4–0–33–1, ఖైస్ 4–0–28–0, సలీమ్ 3–0–43–0, షరాఫుద్దీన్ 2–0–25–0, కరీమ్ 3–0–54–0.
అఫ్గానిస్తాన్ ఇన్నింగ్స్: గుర్బాజ్ (సి) సుందర్ (బి) కుల్దీప్ 50; ఇబ్రహీమ్ (స్టంప్డ్) సామ్సన్ (బి) సుందర్ 50; గుల్బదిన్ (నాటౌట్) 55; అజ్మతుల్లా (సి) రవి బిష్ణోయ్ (బి) సుందర్ 0; నబీ (సి) అవేశ్ (బి) సుందర్ 34; కరీమ్ (రనౌట్) 2; నజీబుల్లా (సి) కోహ్లి (బి) అవేశ్ 5; షరాఫుద్దీన్ (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 212.
వికెట్ల పతనం: 1–93, 2–107, 3–107, 4–163, 5–167, 6–182.
బౌలింగ్: ముకేశ్ 4–0–44–0, అవేశ్ 4–0–55–1, బిష్ణోయ్ 4–0–38–0, సుందర్ 3–0–18–3, దూబే 2–0–25–0, కుల్దీప్ 3–0–31–1.
సూపర్ ఓవర్...
213 పరుగులు చేయాల్సిన ఆఫ్ఘాన్ కూడా 212 పరుగులే చేయడం, అక్కడితో ఓవర్లు అయిపోవడంతో మ్యాచ్ సూపర్ ఓవర్ వైపు దారి తీసింది. ఇందులో ముకేశ్ వేసిన మొదటి సూపర్ ఓవర్‌లో ఆఫ్ఘనిస్తాన్ బ్యాట్స్‌మెన్ 1 సిక్స్, 1 ఫోర్‌తో 16 పరుగులు చేసింది. తరువాత ఛేదనకు దిగిన రోహిత్ 2 సిక్స్‌లు కొట్టినా చివరకు టీమ్ ఇండియా కూడా 16 పరుగులకే పరిమితమైంది. చివరి బంతికి వేగంగా పరుగు తీయాల్సి వస్తుందనే ఆలోచనతో రోహిత్ ఐదో బంతి తర్వాత రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. అప్పుడు రింకూ బరిలోకి వచ్చాడు. కానీ ఆఖరి బంతికి మరో ఎండ్‌లో ఉన్న యశస్వి 2 పరుగులు రాబట్టలేకపోయాడు. ఫరీద్ వేసిన రెండో సూపర్ ఓవర్లో రోహిత్ 4, 6తో భారత్ 11 పరుగులు చేసింది. అయితే బిష్ణోయ్ వేసిన ఈ ఓవర్ తొలి 3 బంతుల్లోనే అఫ్గాన్ 2 వికెట్లు కోల్పోవడంతో భారత్ గెలుపు ఖాయమైంది.