PM Modi Ukrain Visit: రష్యా–ఉక్రెయిన్ల మధ్య తాముఎప్పుడూ తటస్థమే అన్నారు భారత ప్రధాని మోదీ. తాము ఎవ్వరికీ సపోర్ట్ చేయడం లేదని..భారత దేశం ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోదని చెప్పారు. రెండు దేశాల మధ్యా శాంతి నెలకొనాలన్నదే భారత్ ఆశయం అని చెప్పారు. ఉక్రెయిన్-రష్యా మధ్య నెలకొన్న వివాదాన్ని చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే రష్యా–ఉక్రెయిన్‌లు సమస్యను పరిష్కరించుకోవాలని భారత్ మరోసారి స్పష్టం చేసింది. ఇరు దేశాలు దీనికి పంబంధించి సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు ప్రధాని మోదీ. ఇందుకోసం అన్నివిధాలా సహాయం చేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. యుద్ధం ఎప్పుడ సమస్యకు పరికారం కాదని పునరుద్ఘాటించారు.
యుద్ధసమయంలో భారత విద్యార్ధులను , పౌరులను తరలించడంలో సహాయం చేసిన ఉక్రెయిన్ ప్రభుత్వానికి మోదీ కృతజ్ఞతలు తెలిపారు. భారత్ ఎప్పుడూ మానవతా దృక్కోణంలోనే ఆలోచిస్తుందని..ఉక్రెయిన్‌కు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు.భారత్ వైపు శాంతి ఉంది.. మేము యావత్ ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించిన మహాత్మా గాంధీ భూమి నుండి వచ్చామని అన్నారు. ఉక్రెయిన్‌లో యుద్ధం మిగిల్చిన భయానక పరిస్థితులను తనను బాధించాయని తెలిపారు మోదీ. సమయం వృధా చేయకుండా రష్యా-ఉక్రెయిన్ మాట్లాడుకోవాలి. శాంతి ప్రయత్నాల్లో భారత్ చురుకైన పాత్ర పోషిస్తుంది. యుద్ధంలో భారత్ వైఖరి ఎప్పుడూ తటస్థంగా లేదని, ఎల్లప్పుడూ శాంతికి అనుకూలంగా ఉందని అన్నారు.
Also Read: USA: ప్రజల కోసమే నా జీవితం..డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్