Kamala Harris: డెమోక్రటిక్ నేషనల్ కన్వెన్షన్ చివరి రోజు ఆ పార్టీ అధ్యక్ష అభ్యర్ధి అయిన కమలా హారిస్‌కు ఘన స్వాగతం లభించింది. కొన్ని నిమిషాల పాటూ చప్పట్లు కొడుతూ ఆమెను విష్ చేశారు. US అధ్యక్ష నామినేషన్‌ను ఆమోదించిన మొదటి నల్లజాతి,ఆసియా అమెరికన్ మహిళగా కమలా చరిత్ర సృష్టించారు. అభ్యర్థిత్వాన్ని స్వీకరించాక కమలా హారిస్ చాలా ఉద్వేగంగా , ఎమోషనల్‌గా మాట్లాడారు. తన భర్తకు పెళ్ళిరోజు శుభాకాంక్షలు చెబుతూ తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. దాంతో పాటూ తన మూలాలను, తల్లి గురించి చెప్పారు. తన తల్లే తనకు ఆదర్శమని చెప్పారు. నీ జీవితానికి నువ్వే రచయితవు అని తన తల్లి చెప్పిన మాటలను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటానని కమలా హారిస్ తెలిపారు.
పూర్తిగా చదవండి..USA: ప్రజల కోసమే నా జీవితం..డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్
డీఎన్సీ సమావేశంలో ఈరోజు కమలా హారిస్ తన పార్టీ తరుఫున అధికారికంగా అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్ సహా నాటో కూటమి దేశాలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. దాంతో పాటూ రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి ట్రంప్ మీద ఆమె విరుచుకుపడ్డారు.
Translate this News: