Parliament Elections: మరి కొన్ని నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న వేళ ఈ రోజు ఇండియా కూటమి భేటీ కానుంది. ఢిల్లీలోని అశోక్ హోటల్ లో మధ్యాహ్నం మూడు గంటలకు ఈ సమావేశం జరగనుంది. ఇండియా కూటమి ఏర్పడిన తరువాత భేటీ కావడం ఇది నాలుగవ సారి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవడం కీలక రాష్ట్రాల్లో సీట్ల పంపకం, ప్రచార వ్యూహాలపై నేతలతో చర్చించనున్నారు.
జూన్ 23న పాట్నాలో, జులై 17,18 తేదీల్లో బెంగళూరులో, ఆగస్టు 31, సెప్టెంబర్ ఒకటో వారంలో ముంబైలో ఇండియా కూటమి భేటీ అయింది. తాజాగా మరోసారి ఇండియా కూటమి భేటీ కానుంది. ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాలను కైవసం చేసుకున్న బీజేపీని పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించేందుకు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. గతంలో NDA, UPA గా జాతీయ స్థాయిలో కూటమిలు ఉన్నాయి. బీజేపీకి మద్దతుగా ఉన్న పార్టీలు NDA (National Democratic Alliance) గా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఉన్న పార్టీలు UPA (United Progressive Alliance) గా ఉన్నాయి.
2014 నుంచి దేశ పరిపాలన పగ్గాలను స్వాధీనం చేసుకున్న బీజేపీ పార్టీని ఎన్నికల్లో ఓడించేందుకు.. అలాగే ప్రతిపక్షాల్లో కొత్త ఊపు తెచ్చేందుకు UPA కూటమి పేరును మార్చాలని ఆ కూటమిలో ఉన్న నేతలు నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల UPA కూటమి పేరును INDIA (Indian National Developmental Inclusive Alliance) కూటమిగా పేరు మార్చిన విషయం తెలిసిందే.
ALSO READ: ఆ ఎమ్మెల్యే టీడీపీకి అమ్ముడుపోయాడు.. వైసీపీ నేత ఆరోపణలు
ఇదిలా ఉండగా తాజాగా జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురెబ్బ తగిలింది. రాజస్థాన్, ఛత్తీస్ గర్డ్ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. కేవలం తెలంగాణలోనే అధికారం తెచ్చుకుంది. రేవంత్ రెడ్డి అద్యక్షతన బీఆర్ఎస్ పార్టీని ఓడించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రాజస్థాన్, ఛత్తీస్ గర్డ్ రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలపై రెండు పార్టీలు వ్యూహాలు రచిస్తోన్నాయి. బీజేపీని ఓడించాలని కాంగ్రెస్, మరోసారి అధికారంలో ఉండాలని బీజేపీ.. ఇలా రెండు పార్టీల మధ్య వార్ కొసంగుతూనే ఉంది.