నేటికాలంలో మారుతున్న జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్ల శరీరం అనేక వ్యాధులకు గురవుతుంది. శరీరంలోని ఏదైనా ముఖ్యఅవయవం దెబ్బతింటే అది ఊపిరితిత్తులపై ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎందుకంటే ఊపిరితిత్తులు అనేవి మన శరీరంలో ముఖ్యమైన భాగాల్లో ఒకటి. అందుకే వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటే ఉబ్బసం,శ్వాస తీసుకోకపోవడం, న్యుమెనియా వంటి ఎన్నో వ్యాధుల నుంచి మిమ్మల్ని మీరు భద్రంగా ఉంచుకోవచ్చు.
అయితే నేటికాలంలో మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లతో శరీరం అనేక వ్యాధులకు గురవుతుంది. శరీరంలో ఏదైనా ముఖ్యమైన అవయవం దెబ్బతిన్నట్లయితే..ఊపిరితిత్తుల సమస్య వస్తుంది. ఎందుకంటే మన శరీరంలో ఊపిరితిత్తులు బలహీనమైనప్పుడు,శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. కానీ కొన్ని ఆహారాలు తినడం వల్ల మన ఊపిరితిత్తులు దెబ్బతినకుండా కాపాడుకోవచ్చు. అవేంటో చూద్దాం.
ఇది కూడా చదవండి: నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. వేయికి పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్..!!
బచ్చలికూర:
బచ్చలికూరలో ఎన్నో పోషకాలు నిండి ఉంటాయి. ఇది శ్వాసతీసుకోవడం ఏర్పడిన సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. బచ్చలికూరలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కాబట్టి దీన్ని ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి.
బ్రోకలీ:
బ్రోకలీలో ఎన్నో పోషకాలు ఉంటాయి. విటమిన్ సి, ఫొలెట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఇందులో ఉన్నాయి. మీ ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని ఆహారంలో చేర్చుకోవచ్చు.
వెల్లుల్లి:
మీ ఆహారంలో వెల్లుల్లిని చేర్చుకునే ప్రయత్నం చేయండి. వెల్లిల్లు పోషకాల భాండాగారం. దీని వినియోగం రోగనిరోధకశక్తిని బల పరుస్తుంది. మీ ఆహారంలో వెల్లుల్లి ఉండేలా చూసుకోండి. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అనేక రకాల ఇన్ఫెక్షన్ల నుంచి శరీరాన్ని కాపాడుకోవచ్చు.
ఇది కూడా చదవండి: ఈ రాశుల వారికి ఈ నెలలో మహర్దశ.. ఆ రాశులివే?
పసుపు:
పురాతన కాలం నుంచి పసుపును ఔషధంగా పరిగణిస్తున్నారు. గాయపడినప్పుడు పసుపు తాగితే మంచిది. ఎందుకంటే పసుపు వాటి మూలాల నుంచి అంతర్గత గాయాలను నయం చేస్తుంది. ఊపిరితిత్తులకు పసుపు ఎంతో మేలు చేస్తుంది. వ్యాధుల నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది.