Covid deaths:7 నెలల తర్వాత ఒకేరోజు కోవిడ్ తో ఆరు మరణాలు

దేశంలో కోవిడ్ కుసులు బెంబేలెత్తిస్తున్నాయి. మళ్ళీ పాత రోజులు వస్తాయేమో అన్న ఆందోళనను కలిగిస్తున్నాయి. అన్నింటికన్నా ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్న ముఖ్య విషయం...ఏడు నెలల తర్వాత కోవిడ్ పాజిటివ్ తో ఆరుగురు ఒకేరోజు చనిపోవడం. దీంతో దేశం మొత్తం ఒక్కసారిగా అప్రమత్తమైంది.

Corona: జైల్లో ఖైదీకి కరోనా.. ఏపీలో విజృంభిస్తోన్న వైరస్!
New Update

భారత్ లో యాక్టివ్ కోవిడ్ కేసుల సంఖ్య 3వేలకు చేరుకుంది. దేశంలో జెఎన్-1 వేరియంట్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోంది. చిన్నపిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలనఇ ఆరోగ్యశాఖ సూచిస్తోంది. అయితే ఈ వేరియంట్ అంత ప్రమాదకరమైనది కాదని డబ్లూహెచ్వో తెలిపఇంది. ప్రస్తుతం భారత్ లో కరోనా మరణాల రేటు 1.18గా ఉంది. కానీ నిన్న ఒకే రోజు ఆరుగురు చనిపోవడం మాత్రం ఆందోళన కలిగించే విషయమని వైద్యాధికారులు చెబుతున్నారు.

Also read:తెలంగాణలో మళ్లీ కరోనా కల్లోలం.. హైదరాబాద్ లో 14 నెలల చిన్నారికి ఆక్సిజన్.

మరోవైపు శుక్రవారానికి 10 రాష్ట్రాలతో పాటూ ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో కూడా యాక్టివ్ కేసులు పెరిగాయి. ఆంధ్రప్రదేశ్, బీహార్, ఛత్తీస్ ఘడ్, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, కేరళ, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ లతో పాటూ కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో కోవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా వెల్లడించింది.

తెలంగాణలోనూ కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. కొత్తగా 6 కేసులు నమోదు కాగా, హైదరాబాద్ లో 4, మెదక్ లో 1, రంగారెడ్డిలో ఒక కరోనా కేసులు వెలుగుచూశాయి. ఇప్పటివరకూ 20 కేసులు నమోదయ్యాయి. ఒక్క హైదరాబాద్ లోనే 16 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 19 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఒకరు రికవరీ అయ్యారు.

ఇక ఏపీలోనూ రోనా కొత్త వేరియంట్ జేఎన్ 1పై కేంద్ర ప్రభుత్వ హెచ్చరికల నేపథ్యంలో ఏపీలోనూ వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. రాష్ట్రంలో కొత్తగా 3 కేసులు వెలుగుచూడడంతో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు అన్నారు.

Also Read:ప్రధానమంత్రి అభ్యర్ధిగా మల్లికార్జున ఖర్గే..నితీష్‌తో మాట్లాడిన రాహుల్ గాంధీ

#india #corona #covid #deaths
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe