ఇటీవల మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ భారీ విగ్రహం కూలిపోయిన సంగతి తెలిసిందే. దీంతో విపక్షాలు బీజేపీ సర్కార్‌పై తీవ్రంగా విమర్శలు చేశాయి. నాసీరకపు పనులు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాయి. అయితే ఈ ఘటనపై తాజాగా ప్రధాని మోదీ స్పందించారు. విగ్రహం కూలిపోవడంపై ప్రజలకు క్షమాపణలు చెప్పారు. '' ఈ ఘటన వల్ల బాధకు గురైన వారికి నా క్షమాపణలు చెబుతున్నాను. ఛత్రపతి శివాజీ మహరాజ్‌ను తమ దైవంగా భావించేవారు ఈ ఘటనతో తీవ్ర మనోవేదనకు గురయ్యారు. వారందరికి తలవంచి క్షమాపణలు తెలియజేస్తున్నాను. మనకు ఈ దైవం కంటే గొప్పది ఏదీ లేదని'' ప్రధాని మోదీ అన్నారు.
Also Read: శభాష్ అమ్మాయిలు.. పారాలింపిక్స్‌లో ఒకరికి పసిడి, మరొకరికి కాంస్యం
శుక్రవారం మహారాష్ట్రలోని పాల్ఘర్ పర్యటన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదిలాఉండగా.. కొన్ని రోజుల క్రితం 35 అడుగుల ఎత్తున్న ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిపోయింది. గత ఏడాది డిసెంబర్ 4న నౌకాదళ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అయితే భారీ వర్షాలు, ఈదురు గాలుల వల్లే విగ్రహం కూలిందని పలువురు నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు విగ్రహం ఏర్పాటు చేసిన 9 నెలల్లోనే కూలిపోవడంతో విపక్షాలు తీవ్రంగా విమర్శలు చేశాయి. రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల ప్రచారం మీద ఉన్న దృష్టి.. నాణ్యతపై లేదంటూ సెటైర్లు వేశాయి.
Also Read: సీక్రెట్ కెమెరాల కలకలం.. ఈ చిట్కాలతో చెక్ పెట్టండి