Badhrachalam: భద్రాచలం దగ్గర గోదావరి మహోగ్రరూపం

గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల వల్ల భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 51 అడుగులకు చేరుకుంది. ఇప్పటికే అధికారులు రెండవ ప్రమాద హెచ్చరిక భద్రాచలం వద్ద కొనసాగుతుంది.

Badhrachalam: భద్రాచలం దగ్గర గోదావరి మహోగ్రరూపం
New Update

Badhrachalam: గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల వల్ల భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 51 అడుగులకు చేరుకుంది. ఇప్పటికే అధికారులు రెండవ ప్రమాద హెచ్చరిక భద్రాచలం వద్ద కొనసాగుతుంది. ఎగువ రాష్ట్రం మహారాష్ట్ర నుంచి వస్తున్న వరద దీనికి తోడుగా దిగువన శబరి నదికి భారీగా వరద నీరు రావడంతో భద్రాచలం వద్ద గోదావరి పోటెత్తింది.

ప్రస్తుతం 51 అడుగులు ఉండటంతో ఇంకా రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. ఒకవేళ వరద ఉదృతి 53 అడుగులకి చేరుకుంటే అధికారులుమూడవ ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేస్తారు. ఇప్పటికే భద్రాచలం నుంచి వాజేడు వెంకటాపురంకి వెళ్లే రహదారులు అన్ని స్తంభించిపోయాయి. ప్రధానమైన రహదారి మీదికి తూర్పు బాకు వద్ద రోడ్డుపై గోదావరి నీళ్లు నిల్చడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని సమాచారం.

అదేవిధంగా భద్రాచలం నుంచి కూనవరం, చింతూరు, వీఆర్ పురం వెళ్లే రహదారులు కూడా పూర్తిగా స్తంభించిపోయాయి. అయితే శబరి నది స్పీడు మీద గోదావరి వరద ఆధార పడి వుంది. ప్రస్తుతం వరద నీటి ఫ్లో 53 నుంచి 55 అడుగుల వరకు గోదావరి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి అనుగుణంగా పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేసుకోవాలని అధికారులకి ఆదేశాలు చేశారు. ఇప్పటికే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భద్రాచలంలో అధికారులతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి గోదావరి వల్ల ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Also read: గ్యాస్‌ గీజర్‌ లోని వాయువు పీల్చే ముగ్గురు మృతి!


#telangana #rains #godavari #floods #badrachalam #maharashtra
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి