Cyclone: తీవ్ర తుఫానుగా మారనున్న వాయుగుండం..తీరం దాటేది ఎప్పుడంటే!

పశ్చిమ మధ్య బంగాళాఖాతాల్లో కొనసాగుతున్న అల్పపీడన ప్రాంతం ఈశాన్యం వైపునకు కదిలి మరింత బలపడి వాయుగుండంగా మారింది. ఇది శనివారం నాటికి తీవ్ర తుఫానుగా మారనుందని వాతావరణశాఖ పేర్కొంది.

New Update
Cyclone: తీవ్ర తుఫానుగా మారనున్న వాయుగుండం..తీరం దాటేది ఎప్పుడంటే!

Cyclone Remal Update: పశ్చిమ మధ్య బంగాళాఖాతాల్లో కొనసాగుతున్న అల్పపీడన ప్రాంతం ఈశాన్యం వైపునకు కదిలి మరింత బలపడి వాయుగుండంగా మారింది. ఇది శనివారం నాటికి తీవ్ర తుఫానుగా మారనుందని వాతావరణశాఖ పేర్కొంది. ఈ తుఫాన్‌ ఆదివారం బెంగాల్‌, బంగ్లాదేశ్‌ మధ్య తీరం దాటే అవకాశముందని తెలిపింది. దీనికి రెమల్‌ తుఫాన్‌గా (Cyclone Remal) పేరు కూడా పేరు పెట్టారు. ఈ నేపథ్యంలో ఈశాన్య రాష్ట్రాలకు భారీ వర్ష సూచన చేసింది.

Also Read: అందుకే నేను తెలుగు ఎక్కువగా మాట్లాడను!

బెంగాల్‌, ఉత్తర ఒడిశా, మిజోరాం, త్రిపుర, మణిపూర్‌ రాష్ట్రాలకు హెచ్చరికలు కూడా జారీ చేసింది. తీరందాటే సమయంలో భారీ వర్షాలతోపాటు గంటకు 102 కి.మీ.వేగంతో గాలులు వీస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం కేంద్రీకృతమయిందని దీని ప్రభావంతో రెండు రోజులపాటు ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి సునంద తెలిపారు.

వాయుగుండం ఈశాన్యం దిశగా కదులుతూ బలపడుతున్నదని.. శనివారం తుఫానుగా మారబోతున్నదని తెలిపారు. సోమవారం అర్ధరాత్రి కల్లా బంగ్లాదేశ్‌ – పశ్చిమబెంగాల్‌ మధ్య తీరం దాటుతుందని పేర్కొన్నారు. అకడకడా వర్షాలు కురుస్తాయని తెలిపారు.

Advertisment
తాజా కథనాలు