Weather Alert: ఈ ఏడాది సాధారణం కన్నా అధిక వర్షాలు : ఐఎండీ

ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దీర్ఘకాలిక సగటు వర్షాపాతం 87 సెంటీమీటర్లు ఉండగా.. ఈ ఏడాది 106 శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.

New Update
AP : ఏపీలోకి రుతుపవనాలు... ఉదయం నుంచే పలు జిల్లాల్లో వర్షాలు!

దేశంలో ఎండలు మండిపోతున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో వాతావరణం చల్లబడింది. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. దీర్ఘకాలిక సగటు వర్షాపాతం 87 సింటీమీటర్లు ఉండగా.. ఈ ఏడాది ఇందులో 106 శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. అయితే ప్రస్తుతం మధ్య పసిఫిక్ సముద్రం మీదుగా ఎల్‌నీనో ప్రభావం పరిస్థితులు కొనసాగతున్నాయని వెల్లడించింది.

Also Read: మరోసారి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్సీ కవిత..

ఈ ఎల్‌నినో ప్రభావం మెల్లగా తొలగిపోతూ రుతుపవనాలు మొదలయ్యేనాటికి తటస్థ స్థితికి చేరుకుంటుందని వాతావరణ శాఖ తెలపింది. అంతేకాదు మనదేశంలో ఉన్న ఏకైక ప్రైవేట్ వాతావరణ అంచనాల సంస్థ స్కైమెట్ కూడా ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసినట్లుగానే.. స్కైమెట్‌ సంస్థ కూడా ఇదే చెప్పడంతో ఈసారి వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

publive-image

Also Read: లోక్‌సభ ఎన్నికలు.. నిత్యం పట్టుబడుతున్న రూ.100 కోట్లు

Advertisment
Advertisment
తాజా కథనాలు