Rains In Bengaluru : ఇప్పటికే అడపాదడపా వర్షాలతో(Rains) కాస్త చల్లబడిన బెంగళూరు(Bangalore)... రానున్న రోజుల్లో పూర్తిగా చల్లబడుతుంది అని చెబుతోంది ఇండియన్ వెదర్ డిపార్ట్‌మెంట్(Indian Weather Department). ఈరోజు బెంగళూరుకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. రానున్న వారం రోజులు గ్రీన్ సిటీని బలమైన గాలులు, భారీ వర్షాలు ముంచెత్తుతాయని చెబుతోంది. దీని వలన నగరం అంతా నీటితో మునిగిపోవచ్చని...విపరీతమైన ట్రాఫిక్ అంతరాయం ఏర్పడవచ్చని హెచ్చరిస్తోంది. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందే ఏర్పాట్లు చేసుకుంటే మంచిదని సూచిస్తోంది.
రాబోయే ఏడు రోజులూ వర్షాలే...
ఈరోజు నుంచి వచ్చే ఏడు రోజులపాటూ బెంగళూరులో వర్షాలు పడతాయని చెబుతోంది వాతావరణ శాఖ. మే 8న 21 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. ఒకటి లేదా రెండు సార్లు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయి. తరువాతి రోజు మే 9న కూడా వాతావరణం ఇంచుమించు ఇలాగే ఉండనుంది. ఉష్ణోగ్రతలు 22 నుండి 36 డిగ్రీల సెల్సియస్ వరకు ఉండగా.. తేలికపాటి వర్షంతో ఆకాశం సాధారణంగా మేఘావృతమైన ఉంటుంది. ఇక మే 10 నుండి మే 13 వరకు, ఉష్ణోగ్రతలు 23 మరియు 38 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటాయి. దాంతో పాటూ ఆకాశం మేఘావృతమై ఉండి తేలికపాటి వర్షం కురుస్తుంది. మే 12, 13 తేదీలలో మాత్రం ఓ మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది. మొత్తానికి వారం అంతా చల్లగా ఉండడమే కాకుండా...వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.
అయితే ఇందులో మళ్ళీ రాబోయే రెండు రోజులు మాత్రం ప్రతీరోజు సాయంత్రం మెరుపులు, ఉరుములతో కూడాన వర్సాలు పడతాయని చెబుతోంది వెదర్ డిపార్ట్‌మెంట్. ఇంతకు ముందు కురిసిన వర్షాలకు ఇప్పటికే బెంగళూరు చాలా చల్లబడిందని... ఇప్పుడు పడే వర్షాలకు కాస్త నీటి కరువు కూడా తీరవచ్చని అంటోంది. నిన్న అక్కడ కురిసిన వర్షానికి నగరం అంతా చల్లగా అయిపోయింది. ఈ మధ్య కాలంలో బెంగళూరు ఇంత చల్లగా అవ్వడం ఇదే మొదటిసారి. వాతవరణ శాఖ అంచనాల ప్రకారం ఏప్రిల్ అంతా మండే ఎండలతో చిరాకు పెట్టినా... మే నెల మాత్రం వర్షాలతో ఉపశమనం కలిగిస్తుందని తెలుస్తోంది. మే నెల మొత్తం అంతా సాధారణ వర్షపాతం నమోదవుతుందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. ఒక్క మే నెలలోనే దాదాపు 128.7 శాతం వర్షపాతం నమోదవుతుందని అంచనా వేస్తోంది.
అప్పుడప్పుడూ భారీ వర్షాలు కూడా పడే ఛాన్స్ ఉన్నందువలన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది వాతావరణశాఖ. బయటకు వెళ్ళేటప్పుడు గొడుగును క్యారీ చేయడం మంచిదని సూచించింది.
Also Read:IPL-2024: హైదరాబాద్‌లో ఈరోజు ఐపీఎల్ మ్యాచ్..జరుగుతుందా?