Liquor : ఎన్నికల వేళ.. రూ.100 కోట్ల విలువైన అక్రమ లిక్కర్‌ పట్టివేత

కర్ణాటలోని మైసూరు జిల్లాలోని యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ యూనిట్‌లో రూ.100 కోట్ల విలువైన అక్రమ లిక్కర్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారాల వేళ.. భారీ ఎత్తున మద్యం నిల్వలు పట్టుబడటం సంచలనం రేపుతోంది.

New Update
Liquor : ఎన్నికల వేళ.. రూ.100 కోట్ల విలువైన అక్రమ లిక్కర్‌ పట్టివేత

Liquor Seized : మద్యం(Liquor), డబ్బులు(Money) పంచకుండా ఏ ఎన్నికలు కూడా జరగవనేది అందరికీ తెలిసిన సత్యమే. ఓటర్లను ఆకర్షించేదుకు పార్టీ నాయకులు తమ స్థాయికి తగ్గట్లు భారీగా ఖర్చులు చేస్తుంటారు. దేశంలో లోక్‌సభ ఎన్నికలు(Lok Sabha Elections 2024) సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ నేతలు ఎన్నికల ప్రచారంలో మునిగిపోయారు. ప్రస్తుతం దేశంలో ఎలక్షన్ కోడ్‌(Election Code) అమలులో ఉంది. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో భారీగా నోట్ల కట్టలను పోలీసులు సీజ్‌ చేస్తున్నారు. అయితే తాజాగా కర్ణాటకలో పెద్ద మొత్తంలో అక్రమంగా తరలిస్తున్న దాదాపు రూ.100 కోట్ల విలువైన లిక్కర్ పట్టుబడింది.

Also Read : కవితకు మరో షాక్

ఇక వివరాల్లోకి వెళ్తే.. చామరాజనగర్‌ పార్లమెంటు పరిధిలోని మైసూరు జిల్లా నంజనగూడు తాలూకాలోని తాండ్యా ఇండస్ట్రియల్ ఏరియాలోని యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ యూనిట్‌ను ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ బృందం సభ్యులు సందర్శించారు. ఈ ఆపరేషన్‌లో మైసూరు డివిజన్ ఎక్సైజ్‌ జాయింట్ కమిషనర్ కూడా ఉన్నారు. అక్కడ సెర్చ్‌ చేయగా.. వారికి అక్రమ లిక్కర్‌ను నిల్వ చేయడాన్ని గుర్తించారు. మొత్తం రూ.98.52 కోట్ల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

లోక్‌సభ ఎన్నికల ప్రచారాలు జరుగుతున్న వేళ.. ఇంత పెద్ద మొత్తంలో అక్రమం మద్యం నిల్వలు పట్టుబడటం దుమారం రేపుతోంది. అంతేకాదు ఇప్పటికే దాదాపు 14 వేలకు పైగా బాక్సులు కేరళకు చేరుకున్నాయని సమాచారం. అయితే ఇందులో ఇప్పటివరకు 7 వేల బాక్సులను మాత్రమే పట్టుబడ్డాయని తెలుస్తోంది. అక్రమ రవాణా, హోర్డింగ్‌ వంటి వాటికి పాల్పడటం వల్ల అధికారులు చర్యలు తీసుకున్నారు. అలాగే మరికొందరు నిందితులు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read: హీరో అజిత్ కారుకు యాక్సిడెంట్.. వీడియో వైరల్!

Advertisment
తాజా కథనాలు