Revanth Reddy: కాంగ్రెస్ ఓడిపోతే నిరుద్యోగులు అడవి బాట.. రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు స్టేషన్‌ ఘన్‌పూర్‌లో పర్యటించిన రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే ఉద్యోగాలు రాని యువత అడవిబాట పట్టే అవకాశం ఉందని అన్నారు.

New Update
Revanth Reddy: కాంగ్రెస్ ఓడిపోతే నిరుద్యోగులు అడవి బాట.. రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

Revanth Reddy: ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఈ మేరకు ఆయన నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు. ఈ రోజు స్టేషన్‌ ఘన్‌పూర్‌లో కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించిన విజయభేరి సభలో పాల్గొన్న రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక్క ఊరికి డబుల్ బెడ్ రూం, ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా... కేసీఆర్ బెల్టు షాపులు మాత్రం పెట్టాడని విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ఆదాయం కోసం తెలంగాణ ప్రజలను తాగుబోతులను చేశాడని ధ్వజమెత్తారు. కేసీఆర్ బిడ్డ కవిత (Kavitha) చేసే వ్యాపారం బెల్టు షాపుల బిజినెస్ అంటూ ఆరోపించారు. ఉద్యోగులు ఎన్ని రోజులు పోతే అంతే జీతం ఇస్తారు.. అలాంటప్పుడు ఒక్కరోజు సచివాలయానికి పోని కేసీఆర్ కు జీతం ఎందుకు అని ప్రశ్నించారు.

ALSO READ: టీడీపీకి షాక్ ఇచ్చిన సీఐడీ.. ఆ వివరాలు ఇవ్వాలని నోటీసులు

యువకులకు ఉద్యోగాలు రావాలని సోనియా తెలంగాణ ఇచ్చారని అన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలవకపోతే.. ఉద్యోగాలు రాని యువత అడవిబాట పట్టే అవకాశం ఉందన్నారు. కేసీఆర్‌ వంద తప్పులు పూర్తయ్యాయని.. ఇక కాంగ్రెస్‌ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

కేసీఆర్ (KCR) ముఖ్యమంత్రి అయిన తర్వాత.. రాజయ్య (Rajaiah) ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆడపడుచులు కాలు బయటపెట్టాలంటే భయపడుతున్నారని అన్నారు. ఆడబిడ్డ విషయంలో కడియం శ్రీహరి, రాజయ్య మాట్లాడే పద్ధతి మారాలన్నారు. శ్రీహరి సంగతి రాజయ్య చెప్పిండు, రాజయ్య సంగతి శ్రీహరి చెప్పిండు.. వారిద్దరి గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదని తనదైన శైలిలో పంచ్ లు పేల్చారు రేవంత్. స్టేషన్‌ ఘన్‌పూర్‌లో డిగ్రీ కాలేజీ లేదు.. 100 పడకల ఆస్పత్రి లేదు.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మొదటి సంవత్సరంలోనే డిగ్రీ కాలేజ్ తో పాటు 100 పడకల ఆస్పత్రిని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఈ రెండు సంవత్సరాలలో కేసీఆర్ హరీష్ రావు, కవితమ్మ, రాజయ్య కడియం శ్రీహరి లు పిచ్చి కుక్కల లెక్క తిరుగుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో మొదటిసారి మంత్రివర్గంలో మహిళలకు స్థానం లేదన్నారు. రెండవసారి మంత్రివర్గంలో మాదిగలకు స్థానం లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆరుగురు మహిళలకు టికెట్ ఇస్తే... కాంగ్రెస్ పార్టీ 12 మంది మహిళలకు టికెట్ ఇచ్చిందని వివరించారు.

ALSO READ: ‘కోహ్లీ కాదు.. టీమిండియా తోపు అతడే.. ప్రపంచంలోనే ఇలాంటి ప్లేయర్ లేడు’!

Advertisment
తాజా కథనాలు