ICC world cup 2023: 'కోహ్లీ కాదు.. టీమిండియా తోపు అతడే.. ప్రపంచంలోనే ఇలాంటి ప్లేయర్ లేడు'! ప్రస్తుత క్రికెట్లో రోహిత్ శర్మ లాంటి బ్యాటర్ ప్రపంచంలోనే లేడని చెప్పుకొచ్చాడు పాక్ లెజెండరీ క్రికెటర్ అక్రమ్. ప్రత్యర్థి బౌలర్ ఎవరైనా సరే లెక్కచేయకుండా పరుగులు రాబట్టే బ్యాటర్ రోహిత్ అని.. కోహ్లీ, రూట్, బాబర్ కంటే ప్రస్తుతం రోహిత్ అత్యుత్తమ బ్యాటర్ అని కొనియాడాడు. By Trinath 14 Nov 2023 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి IND VS NZ: ప్రపంచంలో మిగిలిన బ్యాటర్ల తీరు ఒకటైతే టీమిండియా కెప్టె్న్ రోహిత్ శర్మ గేమ్ మరో లెవల్. అయినా గుర్తింపు తక్కువనే చెప్పాలి. కానీ విశ్లేషకులు మాత్రం రోహిత్ ఆటను ఎప్పుడో గుర్తించారు. ఈ వరల్డ్‌కప్‌లో టీమిండియాను కెప్టెన్‌గానూ బ్యాటర్‌గానూ ముందుండి నడిపిస్తున్నాడు రోహిత్(Rohit sharma). పరుగుల పరంగా కోహ్లీతో పోల్చితే రోహిత్ కాస్త వెనుక ఉన్న మాట వాస్తవమే.. ఇద్దరూ 500కుపైగా పరుగులు చేశారు. కానీ కేవలం స్టాట్స్ పరంగానే రోహిత్ ఆటను పరిగణించడం ఏ మాత్రం కరెక్ట్ కాదు.. ఇదే విషయాన్ని చెబుతున్నాడు పాకిస్థాన్ లెజెండరీ ప్లేయర్ వసీం అక్రమ్(Wasim Akram). 𝐑𝐨𝐡𝐢𝐭 𝐒𝐡𝐚𝐫𝐦𝐚 𝐢𝐧 𝐖𝐨𝐫𝐥𝐝 𝐜𝐮𝐩 𝟐𝟎𝟐𝟑 | 𝐃𝐞𝐭𝐚𝐢𝐥𝐬 👇#RohitSharma #CWC2023 #IndianCricketTeam pic.twitter.com/3R1AptsZAM — Doordarshan Sports (@ddsportschannel) November 14, 2023 అక్రమ్ ఏం అన్నాడంటే: అందరూ కోహ్లీ, విలియమ్సన్, రూట్, బాబర్ అజామ్ గురించి మాట్లాడుతుంటారని.. అయితే వీళ్లందరికంటే ప్రస్తుతం రోహిత్ అత్యుత్తమ బ్యాటర్ అని కొనియాడాడు. ఏ బౌలింగ్ దాడిని ఎదుర్కొన్నా, ఇన్నింగ్స్ ప్రారంభంలోనే జట్టుకు అద్భుతమైన స్టార్ట్స్ ఇచ్చిన ప్లేయర్ రోహితేనన్నాడు. 'అంతర్జాతీయ క్రికెట్లో రోహిత్ శర్మ లాంటి ఆటగాడు లేడు. విరాట్ కోహ్లి, జో రూట్, కేన్ విలియమ్సన్, బాబర్ ఆజం గురించి మాట్లాడుతాము, కానీ రోహిత్ భిన్నంగా ఉంటాడు. అతను ప్రత్యర్థి బౌలింగ్ అటాక్‌తో సంబంధం లేకుండా బ్యాటింగ్‌ను చాలా ఈజీగా కనిపించేలా చేస్తాడు' అని అక్రమ్ చెప్పుకొచ్చాడు. Wasim Akram praising Rohit Sharma....!!!! - The rise of Rohit Sharma has been phenomenal, the man for the World Cups. ⭐pic.twitter.com/8B7YnWp9jc — Johns. (@CricCrazyJohns) November 13, 2023 ఎవర్నీ వదలడు: సాధారణంగా ఏ బ్యాటరైనా ప్రత్యర్థి జట్టులోని ఇద్దరు లేదా ముగ్గురు బౌలర్లను టార్గెట్ చేసుకోని పరుగులు పిండుకుంటాడని.. కానీ రోహిత్ మాత్రం బౌలర్ ఎవరైనా కూడా లెక్క చేయడంటూ అక్రమ్ ప్రశంసించాడు. ప్రత్యర్థి జట్టులోని ఐదుగురు ప్రధాన బౌలర్లపైనే ఎదురుదాడి చేసే ఏకైక బ్యాటర్ రోహిత్ అని పొగిడాడు. 'రోహిత్ దూడుడైన ఆటతో బౌలర్లు భయాందోళనకు గురవుతారు, ప్రారంభంలోనే డిఫెన్సివ్ మోడ్‌లోకి వెళ్లిపోతారు' అని అక్రమ్ చెప్పాడు. ఇక అక్రమ్ వ్యాఖ్యలతో ఫ్యాన్స్ కూడా ఏకీభవిస్తున్నారు. ఈ వరల్డ్‌కప్‌లో పవర్‌ప్లేలో రోహిత్ వేగంగా ఆడుతుండడంతో తర్వాత క్రీజులోకి వచ్చే ప్లేయర్లపై ఒత్తిడి తగ్గుతోంది. వాళ్లు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసుకోగలుగుతున్నారు. Also Read: మరోసారి అదే జరిగితే రియల్ చోకర్స్ మనమే.. టీమిండియాకు పట్టుకున్న ఆ టెన్షన్! WATCH: #wasim-akram #rohit-sharma #virat-kohli #icc-world-cup-2023 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి