Rahul Gandhi: బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్‌లో గెలిస్తే.. రాజ్యాంగం నాశనమవుతుంది : రాహుల్ గాంధీ క్రికెట్‌లో కెప్టెన్లు మ్యాచ్ ఫిక్సింగ్ చేసి గెలుస్తారని.. రాజకీయాల్లో బీజేపీ కూడా మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించే ఎన్నికలని.. వాళ్లు(బీజేపీ) గెలిస్తే రాజ్యాంగాన్ని నాశనం చేస్తారంటూ ధ్వజమెత్తారు. By B Aravind 31 Mar 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Rahul Gandhi: పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో బీజేపీ చెబుతున్న 400 ఎంపీ సీట్ల గెలుపు నినాదంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ తీవ్ర విమర్శలు చేశారు. ఈవీఎంలు (EVM), మ్యాచ్ ఫిక్సింగ్, మీడియా, సోషల్ మీడియాలపై ఒత్తిడి పెంచకుండా బీజేపీ 400 సీట్లు గెలువలేదని మండిపడ్డారు. అలా చేయకుంటే.. బీజేపీకి (BJP) కనీసం 180 సీట్లు కూడా రావంటూ ఎద్దేవా చేశారు. సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేసినందకు నిరసనగా.. ఢిల్లిలోని రాంలీలా మైదానంలో చేపట్టిన ర్యాలీలో రాహుల్ ప్రసంగించారు. Also Read: కనీసం 200 మార్కునైనా దాటుతారా.. బీజేపీకి దీదీ సవాల్.. ' ఐపీఎల్ మ్యాచుల్లో కెప్టెన్లు.. అంపైర్లపై ఒత్తిడి చేసి, ప్లేయర్లను కొని మ్యాచ్ గెలుస్తారు. క్రికెట్‌లో దీన్ని మ్యాచ్ ఫిక్సింగ్ అని అంటారు. రాజకీయాల్లో కూడా పార్లమెంటు ఎన్నికలకు ముందు మ్యాచ్ ఫిక్సింగ్ జరుగుతోంది. అంపైర్లు ప్రధాని మోదీని ఎంపిక చేసుకుంటారు. మా జట్టు నుంచి ఇద్దరు ఆటగాళ్లను అరెస్టు చేస్తారు. పేదల నుంచి భారత రాజ్యాంగాన్ని లాక్కునేందుకు ప్రధాని మోదీ (PM Modi), మరికొందరు ధనవంతులు మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తున్నారు' అంటూ రాహుల్ విమర్శించారు. ' ఈ లోక్‌సభ ఎన్నికలు సాధారణ ఎన్నికలు కావు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించే ఎన్నికలు. వాళ్లు (బీజేపీ) మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తారు. ఇందులో గెలిస్తే ఆ తర్వాత రాజ్యాంగాన్ని నాశనం చేస్తారు. రాజ్యాంగ అనేది ప్రజల గొంతుక. ఏదో ఒకరోజు రాజ్యాంగాన్ని కనుమరుగయ్యేలా చేస్తారు. అప్పుడు దేశం నాశనం అవుతుందంటూ' రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలాఉండగా.. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న కౌంటింగ్ నిర్వహించనున్నారు. Also Read: ప్రధాని మోదీనే కేజ్రీవాల్‌ను జైల్లో పెట్టారు-సునీత కేజ్రీవాల్ #telugu-news #congress #rahul-gandhi #national-news #india-alliance మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి