IDBI :2100 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చిన ఐడీబీఐ బ్యాంక్ బ్యాంక్ జాబ్స్ మీ కలా..అయితే ఈ న్యూస్ మీకోసమే. తాజాగా ప్రముఖ బ్యాంక్ ఐడీబీఐలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు. మొత్తం 2100 పోస్టులను భర్తీ చేయనున్నారు. By Manogna alamuru 29 Nov 2023 in జాబ్స్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి IDBI Bank Recruitment 2023: వరుసపెట్టి బ్యాంక్ జాబ్స్నోటిపికేషన్స్ పడుతున్నాయి. తాజాగా ప్రముఖ బ్యాంక్ ఐడీబీఐలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. దీని ప్రకారం 2100 పోస్టులను భర్తీ చెయ్యనున్నారు. వాటి అర్హతలు, చివరి తేదీ వివరాలు ఇలా ఉన్నాయి. మొత్తం 2100 పోస్ట్ లలో జూనియర్ అసిస్టెంట్ మేనేజర్(జేఏఎం), గ్రేడ్ ఓ-800 పోస్టులు, ఎగ్జిక్యూటివ్ సేల్స్ అండ్ ఆపరేషన్స్(ఈఎస్‌ఓ)-1300 పోస్టులు ఉన్నాయి. వీటికి అప్లై చేయాలంటే ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. దాంతో పాటూ 01.11.2023 నాటికి 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. Also Read: హమ్మయ్య క్లారిటీ వచ్చేసింది..టీమ్ ఇండియా కోచ్‌గా ద్రావిడ్ కొనసాగింపు వేతనం.. జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు ఏడాది రూ.6.14 లక్షలు నుంచి రూ.6.50 లక్షలు, ఎగ్జిక్యూటివ్ పోస్టులకు నెలకు రూ.29,000 నుంచి రూ.31,000 వరకూ ఇవ్వనున్నారు. ఇంటర్వ్యూ ప్రక్రియ.. ఆన్‌లైన్ పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ప్రీ రిక్రూట్‌మెంట్ మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు. దరఖాస్తు ప్రక్రియ.. ఐడీబీఐలో ఉద్యోగా లకోసం ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అప్లై చేసుకోవాల్సిన చివరి తేదీ 06.12.2023. ఇక జేఏఎం పోస్టులకు 31.12.2023, ఎగ్జిక్యూటివ్ పోస్టులకు 30.12.2023న ఆన్ లైన్ పరీక్షలు ఉండనున్నాయి. ఈ ఉద్యోగాల గురించి మరింత సమాచారం తెలుసుకోవాలంటే అధికార వెబ్ సైట్ www.idbibank.in ను పరిశీలించగలరు. Notification PDF Apply Online #idbi #latest-jobs-in-telugu #bank #jobs #idbi-recruitment-2023 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి