ICC world Cup 2023: ధోనీ రికార్డుపై రోహిత్ కన్ను.. అదే జరిగిదే బెస్ట్ కెప్టెన్ హిట్‌మ్యానే..! టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ వరల్డ్‌కప్ మ్యాచ్‌ల్లో వరుసగా 11 మ్యాచ్‌ల్లో విజయం సాధించాడు. 2023 వరల్డ్‌కప్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వరుసగా 9 మ్యాచ్‌ల్లో గెలిచాడు. మరో రెండు మ్యాచ్‌లు రోహిత్ గెలిస్తే ధోనీ రికార్డును సమం చేస్తాడు. By Trinath 14 Nov 2023 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి Dhoni vs Rohit: క్రికెట్‌పై ధోనీ(MS Dhoni) చెరగని ముద్ర వేశాడు. అటు బ్యాటింగ్, ఇటు కీపింగ్‌తో పాటు కెప్టెన్సీలో మహేంద్రుడికి తిరుగులేని రికార్డులున్నాయి. అసలు ధోనీ టాక్టిక్స్ అర్థం చేసుకోవడం చాలా కష్టం. ప్రత్యర్థులకు ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వకుండా ధోనీ తన బ్రెయిన్‌తోనే మ్యాచ్‌లను గెలిపించేవాడు. టీమిండియాకు ఒక టీ20 వరల్డ్‌కప్, ఒక వన్డే ప్రపంచకప్, ఒక ఛాంపియన్స్ ట్రోఫీ అందించాడు ధోనీ. అందుకే లిమిటెడ్ ఓవర్ల ఫార్మెట్లో ధోనీని బెస్ట్ ఇండియన్ కెప్టెన్‌గా పరిగణిస్తారు. అలాంటి ధోనీ రికార్డులకే ఎసరు పెట్టాడు నయా కెప్టెన్ కూల్ రోహిత్ శర్మ(Rohit Sharma). సమం చేస్తాడా? ఈ వరల్డ్‌కప్‌లో రోహిత్ టీమిండియాకు అద్భుతమైన విజయాలు అందించాడు. కెప్టెన్‌గా 100కి 100మార్కులు కొట్టేశాడు. తన కెప్టెన్సీ స్కిల్స్‌తో గ్రూప్ స్టేజీలో ఒక్కటంటే ఒక్క మ్యాచ్‌ను కూడా ఓడనివ్వలేదు రోహిత్. తొమ్మిది మ్యాచ్‌లు ఆడితే అన్నింటిలోనూ గెలిచాడు రోహిత్. వరల్డ్‌కప్‌లో ముందుగా సెమీస్ బెర్త్‌ను ఫిక్స్ చేసుకున్నది భారత్ జట్టే. వరుసగా 9 మ్యాచ్‌ల్లో గెలిచిన రోహిత్ వరల్డ్‌కప్ హిస్టరీలో టీమిండియా నుంచి అత్యధికంగా వరుసపెట్టి మ్యాచ్‌లు గెలిచిన జాబితాలో రెండో ప్లేస్‌కు వచ్చాడు. 2011, 2015 ప్రపంచకప్‌లో ధోనీ వరుసగా 11 మ్యాచ్‌లు గెలిచాడు. భారత్ తరుఫున ఇదే బెస్ట్. లిస్ట్ లో గంగూలి కూడా: టీమిండియా సెమీస్ గెలిస్తే రోహిత్ ఖాతాలో వరుసగా పదో విజయం దక్కుతుంది. ఫైనల్లో కూడా గెలిస్తే ఆ సంఖ్య 11కు చేరుతుంది. అప్పుడు ధోనీ రికార్డు సమం అవుతుంది. ఇక ప్రపంచవ్యాప్తంగా వరుస పెట్టి వరల్డ్‌కప్‌ల్లో అత్యధిక మ్యాచ్‌లు గెలిచిన జాబితాలో రికీ పాంటింగ్ ఉన్నాడు. పాంటింగ్ వరుసగా 24 మ్యాచ్‌ల్లో విజయం సాధించాడు. ఈ రికార్డును చెరపడం ఇప్పటికైతే అసాధ్యంగానే కనిపిస్తోంది. భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ 2003 వన్డే ప్రపంచ కప్‌లో ఫైనల్‌కు చేరుకునే క్రమంలో భారత్‌కు వరుసగా ఎనిమిది విజయాలు అందించాడు. న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ 2015 వన్డే ప్రపంచకప్‌లో వరుసగా ఎనిమిది మ్యాచ్‌లు గెలిచాడు. Also Read: ‘కోహ్లీ కాదు.. టీమిండియా తోపు అతడే.. ప్రపంచంలోనే ఇలాంటి ప్లేయర్ లేడు’! #india-vs-newzealand #rohit-sharma #ms-dhoni #icc-world-cup-2023 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి