అక్బరుద్దీన్ ఉంటే నేను ప్రమాణస్వీకారం చేయను.. రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

అక్బరుద్దీన్ ప్రోటెం స్పీకర్ గా ఉంటే తాను ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయనని తేల్చి చెప్పారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే వాళ్ళతో ఎంఐఎం కలిసిపోతుందని అన్నారు. రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి.

Raja Singh: మరో స్టాండప్‌ కమెడియన్‌ని టార్గెట్ చేసిన రాజాసింగ్..
New Update

Raja Singh Sensational Comments : గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్(Raja Singh) సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఎక్కువ రోజులు కాంగ్రెస్(Congress)   అధికారంలో ఉండదని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ వారు వాళ్లకు వాళ్లే కోట్లాడి ప్రభుత్వాన్ని పడగోడతారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని అన్నారు. ప్రస్తుతం రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో దుమారం లేపాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర చేస్తుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

రేపు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అసెంబ్లీ సమావేశాలు జరగనున్న విషయం తెలిసిందే. తెలంగాణ ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్యేలందరూ అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అక్బరుద్దీన్ (Akbaruddin Owaisi) ప్రోటెం స్పీకర్ గా ఉంటే .. తాను ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయను అని తేల్చి చెప్పారు.

రేపు బీజేపీ నేతల భేటీ..

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) అధ్యక్షతన ఎన్నికల్లో గెలిచిన 8 మంది బీజేపీ ఎమ్మేల్యేలు (BJP MLA's) హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో రేపు ఉదయం సమావేశం కానున్నారు. భాగ్యలక్ష్మి అమ్మవారిని బీజేపీ ఎమ్మెల్యేలు దర్శించుకోనున్నారు. కిషన్ రెడ్డి తో సమావేశం అయిన తరువాత తదుపరి కార్యచరణపై చర్చించనున్నారు. అయితే, బీజేపీ ఫ్లోర్‌ లీడర్‌గా రాజాసింగ్ పేరును బీజేపీ అధిష్టానం దాదాపు ఖరారు చేసినట్లు సమాచారం. ఈ ఎన్నికల్లో గెలిచిన 8 మంది బీజేపీ ఎమ్మెల్యేల కంటే రాజాసింగ్ సీనియర్ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

#bjp-mla-raja-singh #mla-raja-singh #telangana-bjp #telugu-latest-news #akbaruddin-owaisi
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe