PM Kishida: జపాన్ రాజకీయాల్లో మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఆ దేశ ప్రధాని ఫుమియో కిషిదా తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. రాజకీయ కుంభకోణాలు, ప్రజల అసంతృప్తి నేపథ్యంలో తాను ఈ నిర్ణయానికి వచ్చిట్టు కిషిదా అనౌన్స్ చేశారు. వచ్చే నెలలో తాను తన పదవికి రాజీనామా చేస్తానని ఆయన చెప్పారు. దాంతో పాటూ అదే నెలలో జరగనున్న లిబరల్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో కూడా తాను పోటీ చేయడం లేదని ఆయన ప్రకటించారు. కిషిదా నిర్ణయంతో ఆయన స్థానంలో పార్టీ అధ్యక్షుడి కోసం పోటీ నెలకొంది.
ప్రజలు తన పట్ల చాలా అసంతృప్తిగా ఉన్నారని...అందుకే తనను ఎల్‌డీపీ నాయకుడిగా ఎన్నుకోకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నానని కిషిదా చెప్పారు. ప్రజల విశ్వాసం లేకుండా రాజకీయాల్లో ఉండలేమని అన్నారు. రాజకీయ సంస్కరణలను ముందుకు తీసుకెళ్లాలనే దృఢ సంకల్పంతో తాను ప్రజల గురించి ఆలోచించి ఈ భారీ నిర్ణయం తీసుకున్నాని చెప్పారు.
Also Read: Breaking: భారత్‌కు రజతం లేదు..వినేశ్ కేసు కొట్టేసిన సీఏఎస్