Emergency Alert in Japan: కాలు దువ్విన కిమ్...జపాన్ ప్రధాని హెచ్చరిక .!!
ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ రష్యా పర్యటనలో ఉన్నారు. ఇదిలా ఉంటే జపాన్ ప్రధాని అధికారిక హ్యాండిల్ నుంచి చేసిన ట్వీట్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఉత్తర కొరియా అనుమానాస్పద బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిందని జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్లో రాశారు. దీంతో ఆయన ఎమర్జెన్సీ అలర్ట్ ప్రకటించారు. ఈ వార్తల తరువాత, జపాన్ చాలా అప్రమత్తంగా ఉంది.