చైనాకు చెందిన ప్రముఖ సోషల్ మీడియా యాప్ టిక్‌టాక్‌ను మన దేశంలో బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. ఇంకా పలు దేశాల్లో కూడా ఈ యాప్‌పై నిషేధం ఉంది. అయితే దీనిపై తాజాగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను అధికారంలోకి వస్తే.. టిక్‌టాక్‌ను దేశంలో బ్యాన్ చేయనని స్పష్టం చేశారు. ఈ యాప్‌పై చర్యలు తీసుకునే బిల్లును ఇటీవలే అమెరికా ప్రతినిధుల సభ ఆమోదించింది. ట్రంప్ కూడా దీనికి ముందు పరోక్షంగా మద్దుతు తెలిపారు.
Also Read: టీడీపీకి ప్రధాని మోదీ బంపర్ ఆఫర్
అయితే కొన్ని రోజుల క్రితం ఆయన టిక్‌టాక్‌లో చేరడంతో.. ఈ నిర్ణయాన్ని మార్చుకున్నారని న్యూయార్క్ పోస్ట్ ఓ కథనంలో వివరించింది. తాజాగా మీడియాతో ట్రంప్ మీడియాతో మాట్లాడారు. మీరు అధికారంలోకి వస్తే టిక్‌టాక్‌ను బ్యాన్ చేయనని కచ్చితంగా చెప్పగలరా అని ప్రశ్నించగా.. అందులో సందేహమేముంది. నేను ఎప్పటికీ టిక్‌టాక్‌ను బ్యాన్ చేయనని తేల్చిచెప్పారు.
ఇదిలాఉండగా.. అమెరికాలో టిక్‌టాక్‌ను నిషేధించేందుకు అధ్యక్షుడు బైడెన్ ఇటీవల బిల్లును తీసుకొచ్చారు. దీనికి 352 మంది ఓటు వేయగా.. 65 మంది వ్యతిరేకించారు. అలాగే టిక్‌టాక్ మాతృసంస్థ అయిన బైట్ డ్యాన్స్ దాని మెజారిటీ వాటాలను ఉపసంహరించుకోవాలని కూడా బైడెన్ ప్రభుత్వం భావిస్తోంది. కానీ దీన్ని రిపబ్లికన్ పార్టీ మాత్రం వ్యతిరేకిస్తోంది. ఇలా చేస్తే.. జాతీయ భద్రత ప్రమాదంలో పడుతుందని వాదనలు చేస్తోంది. ఈ ఏడాది నవంబర్‌లో అమెరికాలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. యువతను ఆకర్షించేందుకే ట్రంప్ టిక్‌టాక్‌ను బ్యాన్ చేయకూడదని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Also Read: ప్రధాని మోదీ జీతమెంత ఉంటుందో తెలుసా ?