Ashok Gehlot: ముఖ్యమంత్రి పదవిపై అశోక్‌ గెహ్లాట్ సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..

వచ్చే నెలలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్ తన పదవిపై కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ప్రధాన ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ సీనియర్ నేత సచిన్ పైలట్‌పై పరోక్షంగా విమర్శలు చేశారు. అలాగే దేవుని దయతో.. తనను నాలుగోసారి ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నానని ఓ మహిళ తనతో చెప్పినట్లు తెలిపారు. తాను ముఖ్యమంత్రి పదవిని విడిచిపెట్టాలని అనుకున్నప్పటికీ కూడా.. ఆ పదవి తనని విడిచిపెట్టడం లేదని ఆమె తనతో చెప్పినట్లు పేర్కొన్నారు.

Ashok Gehlot: ముఖ్యమంత్రి పదవిపై అశోక్‌ గెహ్లాట్ సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..
New Update

వచ్చే నెలలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇప్పటికే ప్రచారాలు , బహిరంగ సభలు ఏర్పాటు చేస్తూ.. విమర్శలు చేసుకుంటున్నాయి. తెలంగాణ, మిజోరాంలో ప్రాంతీయ పార్టీ ప్రభావం ఉండగా.. ముఖ్యంగా రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్యే హోరాహోరిగా పోటీ జరగనుంది. ఛత్తీస్‌గడ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఇప్పటికే కాంగ్రెస్ అధికారంలో ఉంది. అలాగే 200 అసెంబ్లీ స్థానాలున్న రాజస్తాన్‌కు నవంబర్ 25న ఒకే విడుతలో ఎన్నికలు జరగనున్నాయి. ఇక డిసెంబర్ 3న ఐదు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు చేయనున్నారు. అయితే ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలోని మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. తనకు ప్రధాన ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ సీనియర్ నేత సచిన్ పైలట్‌పై పరోక్షంగా విమర్శలు చేశారు. అలాగే దేవుని దయతో.. తనను నాలుగోసారి ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నానని ఓ మహిళ తనతో చెప్పినట్లు తెలిపారు. తాను ముఖ్యమంత్రి పదవిని విడిచిపెట్టాలని అనుకున్నప్పటికీ కూడా.. ఆ పదవి తనని విడిచిపెట్టడం లేదని ఆమె తనతో చెప్పినట్లు పేర్కొన్నారు. తనలో ఏదో దాగుందని.. అందుకే కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్రానికి మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఎంపిక చేసిందని వ్యాఖ్యానించారు.

అయితే కాంగ్రెస్ అధిష్ఠానం తీసుకునే ఏ నిర్ణయమైనా కూడా అందరికి ఆమోదయోగ్యంగానే ఉంటుందని అశోక్ గెహ్లాట్ అన్నారు. అయితే కాంగ్రెస్ ఎన్నికల కోసం తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేసేందుకు ఎందుకు ఆలస్యం చేసిందన్న ప్రశ్నకు కూడా గెహ్లాట్ స్పందించారు. విపక్ష బీజేపీ మాత్రమే ఈ విషయంపై చింతిస్తోందంటూ కౌంటర్ వేశారు. తాము పోట్లాడటం లేదని.. అందుతే బీజేపీ ఆందోళన వ్యక్తం చేస్తోందంటూ చురకలంటించారు. అందరి అభిప్రాయాలు పరిశీలించిన తర్వాత నిర్ణయాలు తీసుకుంటామని వ్యాఖ్యానించారు. అలాగే తాను సచిన్ పైలట్ మద్దతుదారులతో కూడా చర్చలు జరుపుతున్నానని.. వారికి అనుకూలంగానే నిర్ణయం తీసుకుంటున్నానని చెప్పారు. ప్రస్తుతం నిర్ణయాలు సజావుగా తీసుకుంటున్నామని.. అందుకే బీజేపీ నేతల్లో ఆందోళన మొదలైందని పేర్కొన్నారు.

అలాగే ఒకవేళ మంచి ప్రత్యామ్నాయం దొరికినట్లైతే.. కాంగ్రెస్ తప్పకుండా అభ్యర్థుల్ని మారుస్తుందని తెలిపారు. తమ పార్టీలో ప్రస్తుతం ఎటువంటి చీలకలు అనేవి లేవని.. తాను క్షమించు, మర్చిపో అన మంత్రాన్ని అనుసరిస్తున్నానని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. గతంలో అశోక్ గెహ్లాట్, ఆయన మాజీ డిప్యూటీ పైలట్ నేతృత్వంలోని క్యాంపుల మధ్య విభేదాలు జరిగాయి. దీంతో 2020లో గెహ్లట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. సచిన్ పైలట్ తన క్యాంపుతో కలిసి తిరుగుబాటు చేశారు. ఆ సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వ దాదాపుగా కూలిపోయే పరిస్థితికి వచ్చింది. కానీ చివరికి హైకమాండ్ ఈ ప్రమాదం నుంచి కాపాడింది. అందుకే అవకాశం వచ్చినప్పుడల్లా అశోక్ గెహ్లాట్‌.. సచిన్ పైలట్‌పై విరుచుకుపడతారు. ఇప్పుడు తాజాగా మరోసారి ఆయన పైలట్‌పై విమర్శలు చేయడం చర్చనీయాంశమైంది. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ పార్టీ రాజస్థాన్ మినహా మిగిలిన నాలుగు రాష్ట్రాలకు తమ అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేసింది. అయితే రాజస్థాన్‌లో రెబల్ ఎమ్మెల్యే సచిన్ పైలట్‌ల మధ్య ఘర్షణ జరుగుతున్న నేపథ్యంలో అభ్యర్థుల జాబితాను విడుదల చేసే విషయంలో జాప్యం జరుగుతోందని భావిస్తున్నారు.

#sachin-pilot #telangana-news #ashok-gehlot #telugu-news #congress
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి