Ashok Gehlot: ముఖ్యమంత్రి పదవిపై అశోక్ గెహ్లాట్ సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..
వచ్చే నెలలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్ తన పదవిపై కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ప్రధాన ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ సీనియర్ నేత సచిన్ పైలట్‌పై పరోక్షంగా విమర్శలు చేశారు. అలాగే దేవుని దయతో.. తనను నాలుగోసారి ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నానని ఓ మహిళ తనతో చెప్పినట్లు తెలిపారు. తాను ముఖ్యమంత్రి పదవిని విడిచిపెట్టాలని అనుకున్నప్పటికీ కూడా.. ఆ పదవి తనని విడిచిపెట్టడం లేదని ఆమె తనతో చెప్పినట్లు పేర్కొన్నారు.