HYDRA-GHMC: హైడ్రాతో ఆయనకు మూడినట్టేనా? ఇంతకీ తప్పు ఎవరిది?

ఒక శాఖ అనుమతి ఇస్తే మరొక శాఖ కూల్చివేస్తుందా? రెండు ప్రభుత్వ శాఖలే కదా? హైడ్రా కూల్చివేతలపై వినిపిస్తున్న ప్రశ్నలివి. ఏ ఒక్కరిని హైడ్రా వదలకపోవడం మంచి విషయమే. అయితే అక్రమకట్టడాలకు అనుమతిచ్చిన అధికారులపై చర్యలేవి? సమాధానం కోసం ఆర్టికల్‌లోకి వెళ్లండి.

New Update
HYDRA-GHMC:  హైడ్రాతో ఆయనకు మూడినట్టేనా? ఇంతకీ తప్పు ఎవరిది?

HYDRA-GHMC: కూల్చడం ఈజీ.. నిర్మించడం కష్టం.. హైడ్రా పేరిట అక్రమ నిర్మాణాలు కూల్చడం సబబే కావొచ్చు.. అయితే అసలు ఈ అక్రమ కట్టడాలకు అనుమతి ఇచ్చింది ఎవరు? ప్రభుత్వ ఆధినంలో పనే చేసే యంత్రాంగాలే కదా? అంటే పర్మిషన్లు ఇచ్చేది ప్రభుత్వాలే.. కూల్చేది ప్రభుత్వాలేనా? మధ్యలో బలైపోయేది ఎవరు? అధికారుల దగ్గర నుంచి అనుమతులు తెచ్చుకున్న తర్వాతే కదా ఎవరైనా కట్టడాల నిర్మాణం ప్రారంభిస్తారు. మరి హైడ్రా కూల్చుతున్న నిర్మాణాలు అక్రమం అయినప్పుడు దానికి నాటి అధికారులు ఎలా అనుమతి ఇచ్చారు? అక్రమ నిర్మాణాలకే అధికారులు పర్మిషన్స్‌ ఇస్తే వారిపై చర్యలేవి? అసలు ఆ ఊసే లేదేందుకు?


అక్రమార్కుల గుండెల్లో రైళ్లు:

సినీ సెలబ్రెటిల నుంచి బడా రియల్టర్ల వరకు ఏ ఒక్కరిని వదలడం లేదు హైడ్రా! హైదరాబాద్‌‌‌‌ డిజాస్టర్‌‌‌‌ రెస్పాన్స్‌‌‌‌ అండ్‌‌‌‌ అసెట్‌‌‌‌ ప్రొటెక్షన్‌‌‌‌ ఏజెన్సీ-హైడ్రా పేరిట అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది రేవంత్‌ సర్కార్. ప్రభుత్వ భూముల పరిరక్షణే లక్ష్యంగా.. ఆక్రమణల తొలగింపే ధ్యేయంగా హైడ్రా దూకుడు కనబరుస్తోంది. ప్రభుత్వ భూములు, చెరువులు, పార్కులు, లే అవుట్లలో సామాజిక అవసరాల కోసం కేటాయించిన స్థలాలు, పరిశ్రమల శాఖకు చెందిన స్థలాల్లో ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. అక్రమ నిర్మాణాలను బుల్డోజర్లతో కూల్చేస్తోంది.


GHMC ఎందుకు అనుమతులిచ్చింది?

ఆక్రమణలకు గురైన చెరువులు, పార్కులు, ప్రభుత్వ భూములను హైడ్రా ద్వారా తిరిగి స్వాధీనం చేసుకుంటోంది. అయితే ఇక్కడ గుమనించాల్సిన విషయం ఒకటి ఉంది. ఈ అక్రమకట్టడాలకు నాడు అనుమతులు ఇచ్చింది కూడా ప్రభుత్వాలే! ఒక ఇంటి నిర్మానం చేపట్టాలంటే దానికి ఎన్నో పర్మిషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్‌లో భవనం కట్టాలంటే జీహెచ్‌ఎంసీని ఆశ్రయించాల్సిందే! దానికి ఆన్‌లైన్ పోర్టల్‌ కూడా అందుబాటులో ఉంది. అప్లికేషన్‌ సబ్మిట్‌ చేసుకున్న తర్వాత అనేక డాక్యూమెంట్లను సమర్పించాల్సి ఉంటుంది. ఈ పత్రాలన్ని వ్యాలిడ్‌గా ఉండాల్సిందే!

డాక్యుమెంట్స్‌ అన్ని కరెక్ట్‌గా ఉన్నాయో లేదో అధికారులే చెక్ చేయాలి. ఆ తర్వాత టెక్నికల్ ఆఫీసర్‌ బిల్డింగ్‌ సైట్‌ను విజిట్ చేస్తారు. అప్పుడు అప్లికెంట్‌ సబ్మిట్‌ చేసిన డాక్యుమెంట్స్‌లో అన్ని నిజాలు ఉన్నాయో లేదో తెలుస్తుంది. ఆ తర్వాతే పర్మిషన్ ఇవ్వాలో లేదో అధికారులు ఓ నిర్ధారణకు వస్తారు. ఇదంతా బిల్డింగ్‌ నిర్మాణం కోసం అప్లై చేసిన ఏడు రోజుల్లో జరుగుతుంది.

నష్టపరిహారం ఎవరు ఇస్తారు?

అన్ని కరెక్ట్‌గా ఉంటేనే అధికారులు పర్మిషన్‌ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఇప్పుడు హైడ్రా కూల్చుతున్న నిర్మాణాలకు నాటి అధికారులే పర్మిషన్స్‌ ఇచ్చారన్న వాదన గట్టిగా వినిపిస్తోంది. వారిపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్‌ బలంగా వినిపిస్తోంది. పర్మిషన్ ఇచ్చిన తర్వాత చాలా డబ్బు ఖర్చు పెట్టి బిల్డింగ్‌లు కడతారు యజమానులు. ఇప్పుడు అక్రమ నిర్మాణమంటూ కూల్చుతే ఆ డబ్బంతా వృధా అయినట్టే కదా! మరి సదరు వ్యక్తికి నష్టపరిహారం ఎవరు ఇస్తారు? నాడు పర్మిషన్లు ఇచ్చిన ఆఫీసర్‌లు ఇస్తారా? లేదా ఇప్పుడు కూల్చుతున్న అధికారులు ఇస్తారా?


డబ్బు చేతులు మారిందా?

టేబుల్‌ కింద చెయ్యి పెట్టే ఆఫీసర్లు ప్రభుత్వ కార్యలయాల్లో ఎక్కువగా కనిపిస్తారన్నది జగమెరిగిన సత్యమే. బిల్డింగ్‌ నిర్మాణం కోసం అప్లై చేసుకున్న యజమానికి పలుకుబడి ఉంటే ఎంత దూరానికైనా వెళ్తారు. ఆఫీసర్లను తమ చెప్పుచేతుల్లో పెట్టుకుంటారు. అయితే ప్రభుత్వం మారగానే అన్ని మారిపోతాయి. అక్రమాలు బయటపడతాయి. అయితే ఇలా బయటపడే అక్రమాలన్ని అధికార పార్టీకి ప్రత్యర్థిగా ఉన్న పార్టీలకు చెందిన వ్యక్తులవే ఉంటున్నయన్న వాదన ఉంది. ఇప్పుడు కాంగ్రెస్‌ తీసుకొచ్చిన హైడ్రా గురించి బీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీలు ఇవే ఆరోపణలు చేస్తున్నాయి.

పర్మిషన్లు ఎందుకిచ్చినట్టు?

ఒక శాఖ అనుమతి ఇస్తే మరొక శాఖ కూల్చివేస్తుందా? రెండు ప్రభుత్వ శాఖలే కదా? మరి అనుమతిచ్చిన ప్రభుత్వ శాఖపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు. సంబంధిత ఆఫీసర్లు ఎందుకు అనుమతిచ్చారు? అసలు బఫర్ జోన్‌లో భూముల అమ్మకానికి, కొనుగోళ్లకు, ఇళ్ల నిర్మాణానికి పర్మిషన్స్ ఎవరు ఇచ్చారో తేలాలి కదా. లేఔట్ వేసేందుకు పర్మిషన్ ఇచ్చిందెవరు ? బఫర్ జోన్లు, చెరువులు అని తెలిసి కూడా నిర్మాణాలకు పర్మిషన్లు ఎందుకు ఇచ్చినట్టు? ఇలా ఎన్నో ఎన్నెన్నో ప్రశ్నలు హైడ్రా ఎపిసోడ్‌లో ఓ వర్గం నుంచి వినిపిస్తున్నాయి!

ఇది కూడా చదవండి: రంగనాథ్ హీరో.. జీహెచ్ఎంసీ జీరో..! హైడ్రా దూకుడుతో పోలీసోడికి జనం జేజేలు

Advertisment
తాజా కథనాలు