HYDRA: హైడ్రా దూకుడు.. బీజేపీ నేత అక్రమ నిర్మాణాలు కూల్చివేత

పార్టీలకతీతంగా హైడ్రా అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది. తాజాగా మైలార్‌దేవ్‌పల్లి బీజేపీ కార్పొరేటర్ తోకల శ్రీనివాస్‌ రెడ్డి అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు. నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేశారని ఆయన ఆందోళనకు దిగారు.

New Update
HYDRA: హైడ్రా దూకుడు.. బీజేపీ నేత అక్రమ నిర్మాణాలు కూల్చివేత

నగరంలో హైడ్రా దూకుడు పెంచుతోంది. అక్రమ నిర్మాణాలున్న చోటికి బోల్డోజర్లు దూసుకెళ్తున్నాయి. ఫిర్యాదు అందిన వెంటనే అధికారులు చర్యలు చేపడుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా హైడ్రాపై మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు మంచి పని చేస్తూన్నారని హర్షిస్తున్నారు. మరికొందరు పేదల ఇళ్లు కూల్చివేస్తున్నారని చెబుతున్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ నేతలు సైతం పేదల ఇళ్లు కూల్చొద్దని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ కూడా పార్టీలకతీతంగా చెరవుల పరిరక్షణే లక్ష్యంగా రేవంత్ సర్కార్‌ మందుకెళ్తోంది.

Also Read: చట్టం బలహీనులకు దూరంగా బలవంతులకు దగ్గరగా ఉంది: పూనమ్ కౌర్

తాజాగా మైలార్‌దేవ్‌పల్లి బీజేపీ కార్పొరేటర్ తోకల శ్రీనివాస్‌ రెడ్డి అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు. అప్ప చెరువు ఎఫ్‌టీఎల్‌లో నిర్మించిన షెడ్లు, పరిశ్రమలను కూల్చివేశారు. అయితే కనీసం నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేశారని కార్పొరేటర్ శ్రీనివాస్‌ రెడ్డి ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా ఈ చర్యలు చేపడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

మరోవైపు రంగారెడ్డి జిల్లా గగన్‌ పహాడ్‌ అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో కూడా టెన్షన్ వాతావరణం నెలకొంది. అక్రమ నిర్మాణాలు కూలుస్తుండగా.. హైడ్రా అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. ముందస్తు సమాచారం లేకుండా ఎలా కూల్చేస్తారంటూ ఆందోళన చేపట్టారు. ఏళ్ల తరబడి ఇక్కడే నివసిస్తున్నామని.. ఇళ్లను కూల్చేందుకు తాము ఒప్పుకోమంటూ వాపోయారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో పలువురు స్థానికులు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత భారీ బందోబస్తు మధ్య అక్రమ కట్టడాలు కూల్చేశారు.

Also Read: రేవంత్‌రెడ్డి సర్కార్‌ తీరుపై కాంగ్రెస్‌ నేత పళ్లంరాజు ఆగ్రహం..!

Advertisment
Advertisment
తాజా కథనాలు