Hyderabad : అడగ్గానే టీ ఇవ్వలేదని కోడలిని గొంతు నులిమి చంపేసిన అత్తగారు

అడిగిన వెంటనే కోడలు టీ ఇవ్వలేదని కోపం తెచ్చుకున్న అత్తగారు ఆమెను గొంతునులిమి చంపేసింది.విషాద ఘటన హైదరాబాద్ నగరంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..అత్తాపూర్ ఠాణా పరిధిలోని హసన్ నగర్‌ లో ఈ దారుణం గురువారం జరిగింది

New Update
Hyderabad : అడగ్గానే టీ ఇవ్వలేదని కోడలిని గొంతు నులిమి చంపేసిన అత్తగారు

Crime : అడిగిన వెంటనే కోడలు టీ (Tea) ఇవ్వలేదని కోపం తెచ్చుకున్న అత్తగారు ఆమెను గొంతునులిమి చంపేసింది. ఈ విషాద ఘటన హైదరాబాద్ (Hyderabad) నగరంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అత్తాపూర్ ఠాణా పరిధిలోని హసన్ నగర్‌ లో ఈ దారుణం గురువారం జరిగింది. వికారాబాద్‌ జిల్లా మోమిన్‌ పేట మండలం టేకులపల్లి గ్రామానికి చెందిన అజ్మీరాబేగం (28) కు హసన్‌ నగర్‌ కు చెందిన అబ్బాస్‌ తో పది సంవత్సరాల క్రితం వివాహం జరిగింది.

వీరికి ఇద్దరు పిల్లలున్నారు. పెళ్లి జరిగినప్పటి నుంచి కూడా అజ్మీరాబేగం , అత్త (Mother In Law) ఫర్జానాబేగం ల మధ్య గొడవలు జరుగుతునే ఉన్నాయి. నిత్యం ఏదోక విషయంలో గొడవ పడుతునే ఉండేవారు. ఈ క్రమంలోనే గురువారం ఉదయం టీ పెట్టి ఇవ్వమని అత్త కోడల్ని అడిగింది.

పిల్లల్ని స్కూల్‌ కి పంపే హడావిడిలో అజ్మీరా అత్తగారి మాటను పట్టించుకోలేదు. దీంతో ఇద్దరి మధ్య పెద్ద వాగ్వాదామే జరిగింది. దీంతో కోపంతో రగిలిపోయిన అత్తగారు... వంటగదిలో పని చేసుకుంటున్న అజ్మీరా మెడకు చున్నీ బిగించి చంపేసింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో అత్త గారి మీద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also read: భారీ వర్షాలకు కూలిన ఎయిర్‌ పోర్ట్‌ రూఫ్‌.. ముగ్గురికి తీవ్ర గాయాలు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు