HYD BREAKING: కారులో మంటలు.. నలుగురి సజీవదహనం!

హైదరాబాద్‌లోని ఘట్‌కేసర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వరంగల్ నుంచి హైదరాబాద్ వైపు వస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో చిక్కుకుని ముగ్గురు సజీవదహనం అయ్యారు. మరొకరు కారులోనే మృతి చెందారు. మృ‌తులు ఉప్పల్ వాసులుగా గుర్తించారు.

New Update
Hyderabad Ghatkesar car fire accident Three burnt alive

Hyderabad Ghatkesar car fire accident Three burnt alive

హైదరాబాద్‌లోని ఘట్‌కేసర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వరంగల్ నుంచి హైదరాబాద్ వైపు వస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో చిక్కుకుని ముగ్గురు సజీవదహనం అయ్యారు. మరొకరు కారులోనే మృతి చెందారు. మృ‌తులు ఉప్పల్ వాసులుగా గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. 

ఇది కూడా చదవండి: తిరుపతిలో ఘోర ప్రమాదం..భక్తులపైకి దూసుకెళ్లిన అంబులెన్స్ ఇద్దరు భక్తులు మృతి

ఇలాంటిదే మరో ఘటన

ఇది కూడా చదవండి:  మాట్లాడలేని పరిస్థితుల్లో హీరో విశాల్‌..అసలేమైందంటే!

ఇలాంటిదే ఏపీలో మరో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నది. బాపట్ల జిల్లా పర్చూరు తూర్పు బజార్‌లో షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇల్లు దగ్ధం కాగా.. ఇద్దరు మహిళలు సజీవ దహనమయ్యారు. మరో ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. మృతులు నాగమణి (35), మాధవీలత (28)గా గుర్తించారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

ఏం జరిగిందంటే? 

Also Read :  భారత్‌లో చైనా కొత్త వైరస్ టెన్షన్ .. లాక్ డౌన్ పక్కానా?

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం తెల్లవారుజామున ఇంట్లో మంటలు చెలరేగడంతో చుట్టు పక్కల వారు గమనించి కేకలు వేశారు. మరికొందరు భయాందోళనకు గురయ్యారు. కొందరు ఫైర్‌  సిబ్బందికి సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన సిబ్బంది హుటాహుటిన మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదవశాత్తు ఇల్లు దగ్ధం కావడం.. ఇద్దరూ మహిళల సజీవ దహనంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు