Hyderabad: ఆటో డ్రైవర్లకు అండగా బీఆర్ఎస్.. సమస్యలపై కమిటీ ఏర్పాటు..

తెలంగాణ వ్యాప్తంగా ఆటో డ్రైవర్స్ సమస్యలపై అధ్యయనం చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఒక కమిటీ ఏర్పాటు చేశారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ కమిటీ నివేదిక ఆధారంగా ఆటో డ్రైవర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నారు.

Hyderabad: ఆటో డ్రైవర్లకు అండగా బీఆర్ఎస్.. సమస్యలపై కమిటీ ఏర్పాటు..
New Update

Telangana: రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందుల పైన విస్తృతంగా అధ్యయనం చేయడానికి పార్టీ కార్మిక విభాగం ఆధ్వర్యంలో ఒక కమిటీని వేస్తున్నట్లు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని కల్పించిన విషయం తెలిసిందే. ఈ పథకం వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఆటో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఆటో డ్రైవర్లు పలు ఆందోళన కార్యక్రమాలు చేపడుతూ తమ స్థితిగతుల పైన ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసిఆర్ ఆదేశాల మేరకు వారి సమస్యలను, వారు కోరుకుంటున్న పరిష్కార మార్గాలను తెలుసుకునేందుకు ఈ కమిటీని వేస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు.

ఈ కమిటీలో భాగంగా కార్మిక విభాగం నాయకులు రూప్ సింగ్, రామ్ బాబు యాదవ్, మరయ్యలు ఆటో డ్రైవర్ల ప్రతినిధులతో మాట్లాడుతారు. కేవలం ఆటో డ్రైవర్లే కాకుండా రాష్ట్రంలో ఉన్న ఓలా, ఉబెర్, ఇతర టాక్సీ డ్రైవర్లతో కూడా వీరు చర్చించి ఒక నివేదికను పార్టీకి అందజేస్తారు.

కార్మిక విభాగం నాయకులు అందించే నివేదిక ఆధారంగా ప్రభుత్వానికి అవసరమైన సలహాలు, సూచనలను ఇస్తామని, ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోసం పార్టీ తరఫున ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకువస్తామని కేటీఆర్ ఈ సందర్భంగా తెలియజేశారు.

Also Read:

టీడీపీలో ఫ్యామిలీ ప్యాకేజీ.. టికెట్ల కోసం నేతల పట్టు..

వ్యూహం సినిమాపై హైకోర్టును ఆశ్రయించిన నారా లోకేష్..

#auto-drivers #telangana #telangana-news #brs-party
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe