Hussain Sagar Danger Bells: నగరాన్ని భయపెడుతున్న హుస్సేన్‌సాగర్‌

కొద్దిరోజులుగా ఎడతెరిపి లేకుండా తెలంగాణ (Telangana) వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. ఇక, హైదరాబాద్‌ మహానగరంలో కూడా భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్ని జలమయమయ్యాయి. అటు, జంట జలాశయాలతో పాటుగా హుస్సేన్‌ సాగర్‌లో భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను అప్రమత్తం చేశారు. ఎటువంటి పరిస్ధితులనైనా ఎదుర్కొనేందుకు జీహెచ్‌ఎంసీ టీం పనిచేస్తోందని ప్రస్తుతం ఎలాంటి ప్రమాదం లేదని తెలిపారు.

Hussain Sagar Danger Bells: నగరాన్ని భయపెడుతున్న హుస్సేన్‌సాగర్‌
New Update

hussain-sagar-water-danger-bell

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు హుస్సేన్‌ సాగర్‌ నిండుకుండను తలపిస్తోంది. భారీగా వరద నీరు సాగర్‌లో వచ్చి చేరుతుండటంతో నీటి మట్టం క్రమక్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం సాగర్‌లో నీటి మట్టం స్థాయి 514.75 మీటర్లకు చేరుకుంది. ఇక, హుస్సేన్‌ సాగర్‌ పూర్తి సామర్థ్యం 515 మీటర్లకు చేరుకుంది. వరదల కారణంగా రోడ్లపై మురికి నీరు చేరడంతో వాహనదారులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

అప్రమత్తంగా ఉండాలని అధికారులకు మంత్రి తలసాని దిశానిర్దేశం

అత్యవసరమైతే తప్ప.. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని మంత్రి తలసాని శ్రీనివాస్(Minister Talasani Srinivas Yadav) యాదవ్‌ తెలిపారు. నిరంతరం జీహెచ్‌ఎంసీ (GHMC) అధికారులు ఎటువంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలని హెచ్చరించారు. గాజుల రామారంలో కాలనీలు జలమయమయ్యాయి. అపార్ట్‌మెంట్‌ల వద్ద కాలనీలు నదులను తలపిస్తున్నాయి. ఇళ్ల నుంచి బయటకు రాలేక స్థానికులు అవస్థలు పడుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అలర్ట్‌ (Alert) అయ్యింది. క్షేత్రస్థాయిలో 157 మొబైల్‌ బృందాలు, 242 స్టాటిస్టికల్‌ బృందాలను ఏర్పాటు చేసింది.

24 గంటలు డ్యూటీలో జీహెచ్‌ఎంసీ సిబ్బంది

ఒక్కో బృందంలో నలుగురు చొప్పున మూడు షిఫ్టుల్లో సిబ్బంది పనిచేస్తున్నారని మంత్రి తలసాని వెల్లడించారు. 339 వాటర్‌ లాగింగ్‌ పాయింట్ల వద్ద ప్రత్యేక చర్యలు చేపట్టారు. అవసరమైన చోట యంత్రాలతో నీటి తొలగింపునకు చర్యలు తీసుకున్నారు. ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా జీహెచ్‌ఎంసీ సిబ్బందితో పాటుగా 437 టీమ్స్‌ పనిచేస్తున్నాయి. నగరంలో కంట్రోల్‌ రూంలను ఏర్పాటు చేశారు. గతంలో బ్రాహ్మణ బస్తీ, లోయర్‌ ట్యాంక్‌బండ్‌ (Lower Tank Bund), మూసాపేట, అంబర్‌పేట,గడ్డి అన్నారంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాంటి పరిస్థితులు జరగకుండా మంత్రి కేటీఆర్ (Minister KTR)) డైరెక్షన్‌లో మరమ్మత్తులు చేయించారు. నాలాలపై వరదనీరు రాకుండా అక్రమకట్టడాలను తొలగిస్తామని మంత్రి తలసాని వెల్లడించారు. అంతేకాకుండా ఉస్సేన్‌సాగర్‌ రెండు తూముల ద్వారా 5,700 క్యూసెక్కుల నీటిని కిందికి విడుదల చేస్తున్నారు.

#hyderabad #heavy-rains #minister-talasani #ghmc #talasani-srinivas #hussain-sagar
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe