Israel-Hamas War: హమాస్ మీద ప్రతీకారేచ్ఛతో రగిలిపోతోంది ఇజ్రాయెల్. హమాస్ కూడా ఎక్కడా తగ్గడం లేదు. మీరు ఆపడం లేదు…మేము ఆపము అంటోంది. వీళ్ళిద్దరి గొడవ మధ్యనా అమాయక ప్రజలు బలైపోతున్నారు. వందల మంది చనిపోతున్నారు. వేల మంది గాయాలపాలవుతున్నారు. ఉత్తర గాజాతో (Gaza) పాటూ దక్షిణగాజాలో కూడా దాడులు చేస్తోంది ఇజ్రాయెల్ (Israel). నిన్న ఓ భవనం మీద చేసిన దాడిలో 15 మంది చనిపోగా, 40మందికి పైగా గాయాలయ్యాయి. ఇందులో చిన్న పిల్లలు కూడా ఉన్నారు. శిథిలాల్లోంచి చిన్న పిల్లల మృతదేహాలు బయటకు తీస్తున్న దృశ్యాలు హృదయవిదారకంగా ఉన్నాయి.
పూర్తిగా చదవండి..Israel-Hamas War: కొనసాగుతున్న భీకర యుద్ధం..బలౌతున్న సామాన్య పాలస్తీనియన్లు
ఇజ్రయెల్, హమాస్ మారణకాండలో సామాన్య పాలస్తీనియన్లు బలౌతున్నారు. ఎవరు ఎంత చెబుతున్నా ఇరుపక్షాలు యుద్ధాన్ని మాత్రం ఆపడం లేదు. శత్రువుల కోసం వేటాడుతున్న ఇజ్రాయెల్ గాజా మీద ఎడాపెడా క్షిపణులతో దాడులు చేస్తూనే ఉంది. దీంతో అక్కడ బీభత్స వాతావరణ నెలకొంది. తాజాగా ఖాన్ యూనిస్‌లో ఓ భవనం మీద బాంబును వేయగా అందులో ఉన్న 15 మంది చనిపోయారు. దాదాపు 40 మంది గాయాలపాలయ్యారు.
Translate this News: