Fitness:చలికాలంలో వ్యాయామం చేసేటప్పుడు ఈ టిప్స్ ఫాలో అయితే మంచిది ఏ కాలమైనా మనం పిట్ గా ఉండడం ముఖ్యం. అయితే కాలాన్ని బట్టి ఎక్సర్సైజులు ఎంచుకుంటే త్వరగా ఫలితాలు చూపిస్తాయి. ముఖ్యంగా చలికాలంలో వర్కౌట్ గురించి ఎక్కువగా ఆలోచించరు. కానీ ఈ టైమ్‌లో కూడా ఎక్సర్‌సైజ్ చేయాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలసిందే. By Manogna alamuru 08 Dec 2023 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి చలికాలం..హాయిగా ముసుగుతన్ని పడుకోవాలనిపిస్తుంది. చలిలో ఏం చేయాలన్నీ చిరాగ్గా ఉంటుంది. కానీ ఏకాలమైనా మన శరీరానికి వ్యాయామం అవసరం. రోజూ వారీ మనం చేసే పనులతో మన బాడీ అంతగా అలిసిపోదు. అందుకే రోజులో ప్రతీ ఒక్కరూ కొంతైన వర్కౌట్స్ చేయాలి అని చెబుతారు నిపుణులు. అలాగే కాలాన్ని బట్టి కూడా వ్యాయామాలను ఎంచుకుంటే మంచిదని అంటున్నారు. దాంతో పాటూ చలికాలంలో వ్యాయామం చేసేటప్పుడు ఈ కింది టిప్స్ ను ఫాలో అవ్వాలి. వాకింగ్, రన్నింగ్... రన్నింగ్, వాకింగ్ అనేది ఆరోగ్యానికి హెల్ప్ చేసే వర్కౌట్స్..అందరూ ఈజీగా చేయగలిగేవి. ఇవి గుండె ఆరోగ్యానికి చాలా మంచివి. చల్లని వాతావరణంలో నడవడం, పరుగెత్తడం వల్ల ఎక్కువ కేలరీలు ఖర్చవుతాయి. ఎందుకంటే, చల్లని గాలి మీ ఏకాగ్రత, ఒత్తిడిని తగ్గిస్తాయి. ఇవి రెండు బరువు తగ్గేందుకు హెల్ప్ చేస్తాయి. Also read:నిరుద్యోగులకు గుడ్ న్యూస్..పలు రైల్వే జోన్లలో ఉద్యోగాల భర్తీ మంచినీరు... చలికాలం పెద్దగా దాహం వేయదు. దాంతో చాలా మంది నీళ్ళు ఎక్కువగా తాగరు. కానీ ఏ టైమ్‌లో అయినా నీరు తాగాలి. దీంతో డీ హైడ్రేట్ అవ్వరు. హైడ్రేషన్ స్థాయిలను అదుపులో ఉంచుకోవాలి. లేకపోతే బాడీలో రక్త ప్రసరణ తగ్గి వేడి తగ్గుతుంది. మీరు డీహైడ్రేట్ అయినప్పుడు చర్మం పొడిగా మారడం, అలసట, తలనొప్పిగా ఉంటుంది. బట్టలు.. ఈ టైమ్‌లో బాడీలో రక్త ప్రసరణ తగ్గి శరీరం బిగుసుకుపోతుంది. దీంతో వర్కౌట్ చేయడం కష్టమవుతోంది. అలా కాకుండా ఉండాలంటే శరీరాన్ని వెచ్చగా ఉంచే బట్టలే ఎప్పుడూ వేసుకోవాలి. అలా అని మరీ ఎక్కువ బట్టలు కూడా వేసుకోకూడదు. అన్నం తిన్నాక... చలికాలంలో పొద్దునే లేదా సాయంత్రం వర్కౌట్స్ చేయాలంటే బద్ధకంగా ఉంటుంది. మార్నింగ్ లేవడం కూడా కష్టమనిపిస్తుంది. అలాంటప్పుడు లంచ్ బ్రేక్ లో వర్కౌట్లు చేయమని చెబుతున్నారు నిపుణులు. దీని వల్ల శక్తితో తిరిగి పని చేయడానికి హెల్ప్ చేస్తుంది. దీనికోసం వాకింగ్, స్ట్రెచింగ్ వర్కౌట్స్ చేయొచ్చు. దీని వల్ల మానసిక సమస్యల, శారీరక బలం, ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. ప్రతిరోజూ వర్కౌట్ చేయడానికి కొన్ని యోగాసనాలు, ధ్యానం చేయొచ్చు. స్ట్రెచెస్... ఏ కాలమైనా స్ట్రెచెస్ మంచి వర్కౌట్. ఇవి మన శరీరాన్ని చలాకీగా ఉంచడంలో సహాయపడతాయి. అందులోనూ చలికాలంలో కచ్చితంగా స్ట్రెచెస్ చేయాలి. దీని వల్ల శరీరం వేడిగా మారి రక్త ప్రసరణ మెరుగ్గా మారుతుంది. కండరాలని సులువు చేసి పనితీరు మెరుగ్గా చేస్తుంది. దీని వల్ల కండరాల ఒత్తిడి, నొప్పి తగ్గి ఎలాంటి సమస్యలు లేకుండా అవుతాయి. #health #exercise #fitness #tips #winter మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి