Relationship : మీ భాగస్వామి అబద్ధం చెబితే ఎలా గుర్తించవచ్చు? ఇవి తెలుసుకోండి!

మీ భాగస్వామి ఎలాంటి కారణం లేకుండా నిరంతరం అబద్ధం చెబుతుంటే జాగ్రత్త పడాలి. అబద్ధం చెప్పినప్పుడు చాలా మంది వాయిస్‌ మారిపోతుంది. మీ భాగస్వామి బాడీ లాంగ్వేజ్ లో ఏదైనా మార్పు కనిపిస్తే అతను ఏదో దాచిపెడుతున్నాడని అర్థం. ఒక వ్యక్తి అబద్ధం చెప్పే వ్యక్తి ముఖంలో ఎక్స్‌ప్రెషన్స్‌ మారవచ్చు

New Update
Relationship : మీ భాగస్వామి అబద్ధం చెబితే ఎలా గుర్తించవచ్చు? ఇవి తెలుసుకోండి!

Life Partner : ప్రస్తుత కాలం(Present Days) లో ప్రతి విషయంలోనూ నిజం మాట్లాడే వ్యక్తి ఉండడు. కొన్నిసార్లు ఒకరి మంచి కోసం, కొన్నిసార్లు గొడవలను నివారించడానికి కొంతమంది అబద్ధాలను ఆశ్రయిస్తారు. ఒకరి మంచి కోసం అబద్ధం చెబితే అందులో తప్పేమీ లేదని చెబుతుంటారు కానీ అది వంద శాతం నిజంకాదు. బంధాన్ని కాపాడుకునే పేరుతో ఎవరైనా పదేపదే అబద్ధాలు చెబితే అతి మొదటికే మోసం తెస్తుంది. భాగస్వమిపై నమ్మకం పోవచ్చు! మీ భాగస్వామి మీకు అబద్ధం చెబుతారని మీకు అనిపిస్తుందా? మీరు కొన్ని హావభావాలతో వారి అబద్ధాన్ని పట్టుకోవచ్చు.

--> తరచుగా ఒక వ్యక్తి అబద్ధం చెప్పినప్పుడు, అతని ముఖంలో ఎక్స్‌ప్రెషన్స్‌ మారుతుంటాయి.

--> మీరు మీ భాగస్వామిని ప్రశ్నిస్తుంటే వాళ్లు పెదవులను నమలుతున్నారంటే అబద్ధం చెబుతున్నాడని అర్థం కావొచ్చు.

--> ప్రశ్నలకు సమాధానం ఇచ్చేటప్పుడు మీ భాగస్వామి గొంతులో ఏదైనా మార్పు వస్తే, వారు అబద్ధం చెబుతున్నారని స్పష్టమవుతుంది. అబద్ధం చెప్పినప్పుడు చాలా మంది గొంతులు వణికిపోతాయి.

--> భాగస్వామి(Partner) తో మాట్లాడేటప్పుడు ఐ టు ఐ కంటాక్ట్ ఉండాలి. ఎదురుగా ఉన్న వ్యక్తి మీ నుంచి కళ్ళు దాచి ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంటే వాళ్లు అబద్ధం చెబుతున్నాడని స్పష్టమవుతుంది.

--> మీ భాగస్వామి బాడీ లాంగ్వేజ్(Body Language) లో ఏదైనా మార్పు కనిపిస్తే, అతను ఏదో దాచిపెడుతున్నాడని అర్థం చేసుకోండి.

రిలేషన్‌షిప్(Relationship) సమయంలో బాయ్‌ఫ్రెండ్‌(Boy Friend) లేదా గర్ల్‌ఫ్రెండ్‌(Girl Friend) అబద్ధాలు చెప్పడం ద్వారా ఒకరి హృదయాన్ని మరొకరు గాయపరుస్తారు. మీ భాగస్వామి ఎలాంటి కారణం లేకుండా నిరంతరం అబద్ధం చెబుతుంటే ముందుగా పిలిచి మాట్లాడాలి. ఎందుకు అలా చేస్తున్నారో తెలుసుకోవాలి. అంతేకానీ అరవడం మంచిది కాదు.

గమనిక : ఈ వ్యాసంలో పేర్కొన్న సలహాలు, సూచనలు ఇంటర్‌నెట్‌ నుంచి సేకరించనవి. వైద్య సలహాగా ఈ ఆర్టికల్‌ను భావించకూడదు.

Also Read : గ్లకోమా.. తెలియకుండా కంటిచూపును చంపేస్తుంది..జాగ్రత్తలు ఇలా..

Advertisment
తాజా కథనాలు