Telangana: రెసిడెన్షియల్ పాఠశాలలు ఫుడ్ సేఫ్టీ అథారిటీ లైసెన్స్ తీసుకోవాలి - మంత్రి దామోదర రాజనర్సింహ

విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటమాడితే ఉపేక్షించేది లేదన్నారు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ. శాంపిల్స్ సేకరించి మొబైల్ ఫుడ్ ల్యాబ్స్లో పరీక్షలు నిర్వహించాలని దామోదర రాజనర్సింహ ఆదేశించారు.

New Update
Telangana: రెసిడెన్షియల్ పాఠశాలలు ఫుడ్ సేఫ్టీ అథారిటీ లైసెన్స్ తీసుకోవాలి - మంత్రి దామోదర రాజనర్సింహ

Minister Damodar Raja Narasimha: ఆహారం సరఫరా చేసే హోటళ్లు, బేకరీలు, రెస్టారెంట్లతో పాటు హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలలు ఫుడ్ సేఫ్టీ అథారిటీ లైసెన్స్ (Food Safety License) తీసుకోవాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటమాడితే ఉపేక్షించేది లేదన్నారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు, నాణ్యత పాటించకపోతే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. ప్రతిరోజు సుమారు 200 శాంపిల్స్ సేకరించి మొబైల్ ఫుడ్ ల్యాబ్స్లో పరీక్షలు నిర్వహించాలని దామోదర రాజనర్సింహ ఆదేశించారు.

రాష్ట్రంలో ఆహార భద్రతపై దృష్టి పెట్టామని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ఆహార కల్తీ కాకుండా ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని ప్రతినిధులకు సూచించారు. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి నగరాల్లో ఆహార కల్తీ లేకుండా చేయాలని వివరించారు. నాణ్యమైన ఆహార పదార్థాలు అందించడంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా ఉండాలన్నారు. వర్షాకాలం ఆహారం కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

Also Read: యూనివర్శిటీ ఇంఛార్జి వీసీల పదవీకాలం పొడిగింపు

Advertisment
Advertisment
తాజా కథనాలు