Israel-Hamas War:ఇజ్రాయెల-హమాస్‌ల మధ్య యుద్దం ఆగడం లేదు. ఇప్పటికి అది మొదలై వందరోజులు గడుస్తోంది. హమాస్ తమ దగ్గర ఉన్న బందీలను విడిచిపెట్టలేదు. ఇజ్రాయెల్ కూడా తమ దాడులను ఆపడం లేదు. మధ్యలో ఓ వారం రోజులు యుద్ధం ఆపారు. కొంతమంది బందీలను విడిచిపెట్టారు కానీ మళ్ళీ ఇద్దరూ పట్టుపట్టుకుని కూర్చున్నారు. ఇజ్రాయెల్ దాడులను ఆపాలని ప్రపంచ దేశాలన్నీ చెబుతున్నాయి కానీ ఆ దేశం మాత్రం వినడం లేదు. ఇక హమాస్ కూడా ఎవరి మాటా వినడం లేదు.
Also Read:సచిన్ కు షాక్ ఇచ్చిన కేటుగాళ్లు.. ఆ వీడియో వైరల్
ఇక యుద్ధం మొదలై వంద రోజులు గడిచిన సందర్భంగా హమాస్ తమ ఆధీనంలో ఉన్న బందీల చేత మాట్లాడించింది. అందులో వారు తమని విడిపించాలని...హమాస్ సైనిక చర్యలను నిలిపివేయాలని వారు కోరారు. వెంటనే విడిపంచకపోతే చనిపోయేలా ఉన్నామని చెప్పారు. మరోవైపు తమకు బందీలుగా చిక్కిన వారిలో చాలామంది గాజాలో చనిపోయి ఉండొచ్చని హమాస్ అధికా ప్రతినిధి అబు ఒబేదా ఒక సందేశంలో తెలిపాడు. దీనికి ఇజ్రాయెలే కారణం అని కూడా అన్నాడు. ఇజ్రాయెల్ జరుపుతున్న దాడుల వల్లనే బందీలు చనిపోతున్నారని చెప్పాడు. దాడుల వలన బందీలు తాము సంబంధాలు కోల్పోయామని చెప్పాడు. అటాక్ వలన సొరంగాలు అన్నీ దెబ్బ తిన్నాయని...వాటిల్లో ఉన్న బందీలు తీవ్ర ముప్పు పొంచి ఉందని తెలిపాడు. ఇజ్రాయెల్ దాడులు ఆపకపోతే ఈ ప్రమాదం మరింత పెరుగుతుందని హెచ్చరించాడు.
ఇంకా పెరుగుతాయి..
ఇక ఇజ్రాయెల్ మీద దాడులను తాము ఆపమని భవిష్యత్తులో వాటిని మరింత పెంచుతామని అబు ఒబేదా హెచ్చరిస్తున్నాడు. గాజాలో మసీదులను కూల్చేయడం ద్వారా మతపరమైన యుద్ధానికి తెరతీస్తోందని ఆరోపించాడు. అయితే ఇజ్రాయెల్ ఈ వాదనలను కొట్టిపారేస్తోంది. హమాస్ చేతుల్లో ఉన్న బందీలు వైమానిక దాడుల్లోనే చనిపోయినట్లు ఎక్కడా ఆధారాలు లభ్యం కాలేదని ఇజ్రాయెల్ అంటోంది. ఫోరెన్సిక్ పరీక్షల్లో కూడా అలాంటివేమీ బయటపడలేదని చెప్పారు.
హమాస్ దగ్గర 52 మందిని వదిలేయగా ఇంకా 132 మంది ఉన్నారు. ఇందులో 25 మంది చనిపోయారు.