Taneti Vanitha: వైఎస్ షర్మిలపై హోం మంత్రి తానేటి వనిత సంచలన కామెంట్స్
ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలపై హోం మంత్రి తానేటి వనిత విమర్శలు గుప్పించారు. తెలంగాణలో నమ్ముకున్న వారందరిని నట్టేట ముంచి ఏపీకి వచ్చారన్నారు. షర్మిల నాలెడ్జ్ లేకుండా తనపై ఏవేవో ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెకు రాజకీయ పరిణితి లేదని కామెంట్స్ చేశారు.
Home Minister Taneti Vanitha: రాజానగరంలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో ఆడపడుచులకు ఆసరా కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హోంమంత్రి తానేటి వనిత, మంత్రి వేణుగోపాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. దళిత మహిళనైనా తనకు హోంమంత్రి స్థానం ఇచ్చి సామాజిక సాధికారత కూడా చూపించారన్నారు. ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా జగన్మోహన్ రెడ్డి (CM YS Jagan) వెళుతుంటే ప్రతిపక్షాలు పొత్తుల కుట్రలు పన్నుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగిల్ గా ఎదుర్కొనే ధైర్యం లేక శత్రువులందరూ ఒక్కటై జగన్మోహన్ రెడ్డిపై బురద జల్లుతున్నారని దుయ్యబట్టారు.
ఈ క్రమంలోనే ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలపై (YS Sharmila) తీవ్ర విమర్శలు చేశారు. ఆమె తెలంగాణలో పార్టీ పెట్టి.. ఏం చేశారో అందరికీ తెలుసన్నారు. ఒక పార్టీకి అధ్యక్షురాలుగా ఉండి (Telangana) కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డిని, కేసీఆర్ ను తిట్టారని.. అయితే, అవన్నీ వదిలి ఇప్పుడు కాంగ్రెస్ (Congress) లో చేరిందని వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఆమెను నమ్ముకున్న వారందరిని నట్టేట ముంచి ఏపీకి వచ్చారని కామెంట్స్ చేశారు. ఏపీలో వెంటిలేటర్ పై ప్రాణం పోతున్న కాంగ్రెస్ పార్టీకి అధ్యక్ష పదవిని తీసుకున్నారని చెప్పుకొచ్చారు.
కాంగ్రెస్ పార్టీ, టీడీపీ (TDP) పార్టీ కలిసి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎన్ని చిత్రహింసలకు గురి చేశారో అందరికీ తెలుసన్నారు. అటువంటి పార్టీకి అధ్యక్షురాలుగా షర్మిల రావడం.. ఆమెకు రాజకీయ పరిణితి లేదని అర్థం అవుతుందన్నారు. తాను రాజీనామా చేయటానికి ఎప్పుడైనా సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. పదవిని పట్టుకుని వేలాడటం కోసం తాము రాలేదని చెప్పుకొచ్చారు. వచ్చాము కదా అని షర్మిల ఏదో ఆరోపణలు చేసేస్తే సరిపోదన్నారు. నిజానిజాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గ టిక్కెట్లు మార్పుపై గతంలో చంద్రబాబు మార్చలేదా దాన్ని ఏమంటారు అని ప్రశ్నించారు. రాజకీయ పార్టీలన్న తరువాత ఎవరి ఇష్టం వారిదన్నారు. మా జగనన్న ఏది చెప్తే అది చేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

Also Read: సమస్యను పరిష్కరించకపోతే నీటి సత్యాగ్రహ పాదయాత్ర చేస్తా: కొలికపూడి శ్రీనివాసరావు
ఈ క్రమంలోనే ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలపై (YS Sharmila) తీవ్ర విమర్శలు చేశారు. ఆమె తెలంగాణలో పార్టీ పెట్టి.. ఏం చేశారో అందరికీ తెలుసన్నారు. ఒక పార్టీకి అధ్యక్షురాలుగా ఉండి (Telangana) కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డిని, కేసీఆర్ ను తిట్టారని.. అయితే, అవన్నీ వదిలి ఇప్పుడు కాంగ్రెస్ (Congress) లో చేరిందని వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఆమెను నమ్ముకున్న వారందరిని నట్టేట ముంచి ఏపీకి వచ్చారని కామెంట్స్ చేశారు. ఏపీలో వెంటిలేటర్ పై ప్రాణం పోతున్న కాంగ్రెస్ పార్టీకి అధ్యక్ష పదవిని తీసుకున్నారని చెప్పుకొచ్చారు.
Also Read: కాకినాడలో క్షుద్రపూజలు కలకలం.. భయం గుప్పిట్లో గ్రామ ప్రజలు..!
కాంగ్రెస్ పార్టీ, టీడీపీ (TDP) పార్టీ కలిసి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎన్ని చిత్రహింసలకు గురి చేశారో అందరికీ తెలుసన్నారు. అటువంటి పార్టీకి అధ్యక్షురాలుగా షర్మిల రావడం.. ఆమెకు రాజకీయ పరిణితి లేదని అర్థం అవుతుందన్నారు. తాను రాజీనామా చేయటానికి ఎప్పుడైనా సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. పదవిని పట్టుకుని వేలాడటం కోసం తాము రాలేదని చెప్పుకొచ్చారు. వచ్చాము కదా అని షర్మిల ఏదో ఆరోపణలు చేసేస్తే సరిపోదన్నారు. నిజానిజాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గ టిక్కెట్లు మార్పుపై గతంలో చంద్రబాబు మార్చలేదా దాన్ని ఏమంటారు అని ప్రశ్నించారు. రాజకీయ పార్టీలన్న తరువాత ఎవరి ఇష్టం వారిదన్నారు. మా జగనన్న ఏది చెప్తే అది చేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
BIG BREAKING: ఎంపీ మిథున్ రెడ్డికి బిగ్ రిలీఫ్!
ఎంపీ మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు లో బిగ్ రిలీఫ్ లభించింది. ఆయనకు ఇంటి నుంచి భోజనంతో పాటు టీవీ, బెడ్ కు అనుమతి ఇచ్చింది.
Fish Venkat Wife Interview: ఒక్కడు కూడా రాలేదు.. టాలీవుడ్‌పై ఫిష్ వెంకట్ భార్య ఫైర్
ఫిష్ వెంకట్ భార్య సువర్ణ తాజాగా RTV ఛానెల్‌తో మాట్లాడారు. టాలీవుడ్‌పై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘సినీ పరిశ్రమ నుంచి మాకు తగినంత మద్దతు లభించలేదు. Short News | Latest News In Telugu | సినిమా | ఆంధ్రప్రదేశ్
Mithun Reddy: MP మిథున్ రెడ్డిని నేలపై పడుకోబెట్టిన జైలు అధికారులు
ఏపీ లిక్కర్ స్కాం కేసులో ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. Short News | Latest News In Telugu | విజయవాడ | ఆంధ్రప్రదేశ్
AP Free Bus Scheme: ఫ్రీ బస్సు పథకంపై చంద్రబాబు సంచలన ప్రకటన.. ఇక రయ్ రయ్
APలో మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణ పథకం అమలుపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
AP Liquor Scam: RTV చేతికి కీలక ఆధారాలు.. 7 డెన్లు, రూ.3500 కోట్లు!!
ఏపీ లిక్కర్ స్కామ్ సిట్ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. Short News | Latest News In Telugu | గుంటూరు | విజయవాడ | ఆంధ్రప్రదేశ్
Duvvada Srinivas – Maduri: దువ్వాడ జంట రొమాంటిక్ ప్రీవెడ్డింగ్ షూట్.. వీడియో చూస్తే పిచ్చెక్కిపోతారు..!
దువ్వాడ లవ్ కపుల్ మరోసారి వార్తల్లో నిలిచారు. దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి ఈసారి లాంగ్ టూర్ వేసినట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | వైరల్ | సినిమా | ఆంధ్రప్రదేశ్
BIG BREAKING: బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు
BIG BREAKING: ఎంపీ మిథున్ రెడ్డికి బిగ్ రిలీఫ్!
Fish Venkat Wife Interview: ఒక్కడు కూడా రాలేదు.. టాలీవుడ్‌పై ఫిష్ వెంకట్ భార్య ఫైర్
BIG BREAKING: ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్ రాజీనామా
🔴Live News Updates: ఇదే జరిగితే.. BJPకి ఈటెల రాజేందర్ రాజీనామా..!!