Telangana : నేడు రాష్ట్రానికి కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా

తెలంగాణలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈరోజు పర్యటించనున్నారు. సాయంత్రం వరకు పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు అమిత్ షా. బీజేపీ ముఖ్య నేతలతో, సోషల్ మీడియా వారియర్స్‌తో ప్రత్యేక సమావేశం కానున్నారు హోంమంత్రి.

Maharashtra: ఔరంగజేబు ఫ్యాన్ క్లబ్...ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్‌లు- అమిత్ షా
New Update

Home Minister Amit Shah Tour In Telangana : పౌరసత్వ సవరణ చట్టం(Citizenship Amendment Act) నోటిఫై అయ్యాక కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) మొట్టమొదటిసారి తెలంగాణ(Telangana) కు వస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం 1.20 నిమిషాలకి బేగంపేట విమానాశ్రయానికి(Begumpet Airport) చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా 1.45 నుంచి 2.45 వరకు ఇంపీరియల్ గార్డెన్స్ లో సోషల్ మీడియా వాలంటీర్స్ మీటింగ్‌కు వెళ్ళనున్నారు. అక్కడ వారికి అమిత్ షా దిశా నిర్దేశం చేయనున్నారు. దీని తరువాత 3.15 నుంచి 4.25 వరకు LB స్టేడియం(LB Stadium) లో విజయ సంకల్ప సమ్మేళనంలో పాల్గొననున్నారు. ఇందులో బూత్ కమిటీ అధ్యక్షులు, ఆ పై స్థాయి నేతలను మీట్ అవ్వనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 32 వేల పోలింగ్‌ బూత్‌లు ఉండడంతో ఈ బూత్‌ కమిటీల అధ్యక్షులు, ఇన్‌చార్జిలు, ఇతరనాయకులు కలిపి మొత్తంగా దాదాపు 50 నుంచి 60 వేల మంది వరకు ఈ సమ్మేళనానికి హాజరయ్యే అవకాశాలున్నాయి.

Also Read : National : పెళ్ళి ఊరేంగిపుపై దూసుకెళ్ళిన ట్రక్.. ఐదుగురు మృతి

ఇది అయ్యాక సాయంత్రం 4.45 నుంచి 5.45 వరకు ఐటీసీ కాకతీయ హోటల్‌లో తెలంగాణలోని పార్టీ ముఖ్య నేతలతో అమిత్‌ షా సమావేశం అవుతారు. ఇందులో పార్లమెంట్ ఎన్నికల సమాయత్తత, కార్యచరణ పై మార్గ నిర్దేశం చేయనున్నారు. ఈ మీటింగ్ అయిన వెంటనే 6.10 బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి అమిత్ సా తిరుగు ప్రయాణం అవనున్నట్టు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో హోం మంత్రి అమిత్ షా రాకకకు ప్రాధాన్యత సంతరించుకుంది.

Also Read : Gold Rates : గోల్డ్ లవర్స్ కి గుడ్ న్యూస్.. బంగారం పరుగులకు బ్రేక్.. కాస్త తగ్గిన వెండి!

#amit-shah #bjp #telangana #hyderabad #meetings
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe