Amit Shah: ఏపీ పొత్తులపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు

ఏపీలో పొత్తులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కామెంట్స్ చేశారు. త్వరలోనే పొత్తులు కొలిక్కి వస్తాయాని అన్నారు. అలాగే పౌరసత్వ చట్టం CAA పై అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ ఎన్నికలు ముందే ఈ బిల్లు అమల్లోకి వస్తుందని అన్నారు.

Amit Shah: ఏపీ పొత్తులపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు
New Update

Amit Shah: ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో పొత్తులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కామెంట్స్ చేశారు. త్వరలోనే పొత్తులు కొలిక్కి వస్తాయాని అన్నారు. ఎన్డీయే లోకి కొత్త మిత్రులు వస్తున్నారని అన్నారు అమిత్ షా. రాజకీయంగా పెద్ద కూటమి ఉంటే మంచిదని బీజేపీ అధిష్టానం ఆలోచిస్తున్నట్లు తెలిపారు. తమ కూటమి మిత్రులను తాము ఎప్పుడూ బయటకు పంపలేదని పరోక్షంగా ఇండియా కూటమి పై విమర్శలు చేశారు. రాజకీయ సమీకరణ దృష్ట్యా ఎన్డీయే కూటమి సభ్యులు బయటకు వెళ్లాల్సి వచ్చిందని పేర్కొన్నారు.

ALSO READ: రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్

CAA బిల్ అమలు... 

పౌరసత్వ చట్టం CAA పై అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ ఎన్నికలు ముందే ఈ బిల్లు అమల్లోకి వస్తుందని అన్నారు. దేశ వ్యాప్తంగా ఈ బిల్లును అమల్లోకి తెచ్చేందుకు కార్యాచరణ చేపడుతున్నామని అన్నారు. టైమ్స్ నౌ గ్లోబల్ సమ్మిట్ లో అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ బిల్లు పై భారతీయ ముస్లిం సోదరులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ఈ చట్టం అమల్లోకి రావడం వల్ల భారతీయ ముస్లిం లకు ఎలాంటి నష్టం జరగదని భరోసా ఇచ్చారు. కొందరు ముస్లిం పెద్దలు ఈ బిల్లుపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. వారిని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారని.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. పాకిస్థాన్‌, ఆఫ్గానిస్థాన్‌, బంగ్లాదేశ్‌లలో వివక్ష ఎదుర్కొని భారత్‌కు వచ్చిన వర్గాలకే భారత పౌరసత్వం ఇస్తామనీ, అంతేకానీ ఇక్కడి వారి పౌరసత్వాన్ని లాక్కోవడం యూసీసీ చట్టం ఉద్దేశం కాదని అమిత్​ షా తేల్చి చెప్పారు.

ఈసారి కూడా బీజేపీదే...

త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ మరోసారి గెలిచి అధికారంలో కొంస్దగుతుందని ధీమా వ్యక్తం చేశారు అమిత్ షా. ఇటీవల జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు చేశామని.. దీంతో భారతీయుల్లో బీజేపీపై నమ్మకం పెరిగిందని అన్నారు. జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370ని రద్దు చేయడం ద్వారా ప్రజలు బీజేపీకి 370, మొత్తంగా ఎన్డీయేకు 400 సీట్లు కట్టబెడతారని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు.

DO WATCH: 

#ycp #tdp #bjp #ap-politics #janasena #amit-shah #caa-bill
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe