Bhatti Vikramarka: ఇది ప్రజల జిల్లా దొరల జిల్లా కాదు.. భట్టి కీలక వ్యాఖ్యలు

ఇది ఖమ్మం జిల్లా.. దొరల జిల్లా కాదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండల పరిధిలోని వెంకటాపురంలో పర్యటించిన ఆయన.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఇది ఖమ్మం జిల్లా అని, ప్రజల జిల్లా అని భట్టి స్పష్టం చేశారు. దొరల జిల్లా కాదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Bhatti Vikramarka: ఇది ప్రజల జిల్లా దొరల జిల్లా కాదు.. భట్టి కీలక వ్యాఖ్యలు
New Update

ఇది ఖమ్మం జిల్లా.. దొరల జిల్లా కాదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండల పరిధిలోని వెంకటాపురంలో పర్యటించిన ఆయన.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఇది ఖమ్మం జిల్లా అని, ప్రజల జిల్లా అని భట్టి స్పష్టం చేశారు. దొరల జిల్లా కాదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. జిల్లాకు వచ్చిన హరీష్‌ రావు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్న ఆయన.. ఇది హరీష్ రావు జారిగి కాదని, కేసీఆర్‌ జాగిరి అంతకంటే కాదని భట్టి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలు పోరాడి సాధించుకున్న రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్‌ నాశనం చేశారన్నారు. ప్రజల పోరాటానికి ఇంతవరకు న్యాయం జరగలేదని భట్టి ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ నేతలు మాట్లాడిన ప్రతీ సారి 90 సీట్లు మావేనని చెప్పుకుంటున్నారన్న ఆయన.. ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయే తెలంగాణ ప్రజలే తేల్చుతారని స్పష్టం చేశారు.

హరీష్‌ రావు ఖమ్మం జిల్లాను సిద్ధిపేట జిల్లా అనుకుంటున్నారని భట్టి విక్రమార్క విమర్శించారు.. హరీష్‌ రావు ఖమ్మం జిల్లాకు వచ్చి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి వెళ్తారన్న భట్టి.. జిల్లా రాజకీయాల గురించి ఆయనకు ఏం తెలుసన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్లు, నర్సుల పోస్టులు ఖాళీగా ఉన్నాయన్న ఆయన.. హరీష్‌ రావు ముందు ఖాళీగా ఉన్న పోస్టులను ఫిలప్‌ చేయాలని భట్టి సూచించారు. ఉద్యోగ నోటిఫికేష్‌ విడుదల చేయని ప్రభుత్వం ఇతరుల గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడతున్నారన్నారు.

హరీష్ రావు తనకు ఇచ్చిన ఉద్యోగాన్ని సరిగ్గా నిర్వర్తించాలని అంతే కానీ ఇతరుల గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడవద్దని హితువు పలికారు. ఖమ్మం రాజకీయాల గురించి హరీష్‌ రావుకు ఏం సంబంధమని భట్టి విక్రమార్క ప్రశ్నించారు. హరీష్‌ రావుకు ఇక్కడ ఏమైనా సీటు ఉందా అని ప్రశ్నించారు. తన వల్ల ఖమ్మం జిల్లా ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉందా అన్నారు. రానున్న ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జల్లాలో కాంగ్రెస్‌ జెండా ఎగురుతుందని, రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని భట్టి విక్రమార్క జోస్యం చెప్పారు.

#brs #cm-kcr #harish-rao #bhatti-vikramarka #congress #khammam-district
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe