Varanasi: మూడు దశాబ్దాల తర్వాత జ్ఞానవాపిలో హిందువుల పూజలు

జ్ఞానవాపిలో హిందువులకు పూజలు చేసుకునేందుకు అనుమతిని ఇచ్చింది వారణాసి కోర్టు. పూజలను వారం రోజుల్లో ప్రారంభిస్తామని కోర్టుకు తెలియజేసింది కాశీవిశ్వనాథ ట్రస్ట్. దీంతో 30 ఏళ్ల తర్వాత జ్ఞానవాపిలో సీలు వేసి ఉన్న భూగర్భ గృహంలో స్థానిక పూజారి కుటుంబం గురువారం పూజలు నిర్వహించింది.

New Update
Varanasi: మూడు దశాబ్దాల తర్వాత జ్ఞానవాపిలో హిందువుల పూజలు

Gyanvapi: వారణాసిలోని జ్ఞానవాపి మసీదు లోపల మూసి ఉన్న వ్యాప్ కా టెఖానాలో పార్ధనలు చేయడానికి పెద్ద ఎత్తున హిందువులు (Hindus) అక్కడకు చేరుకున్నారు. వారణాసి కోర్టు అక్కడ హిందువులు పూజలు చేసుకోవచ్చు అని అనుమతి ఇచ్చాక వారం రోజుల్లో సీలు వేసి ఉన్న నేలమాళిగలో పూజలు నిర్వహిస్తామని కాశీ విశ్వనాథ ట్రస్ట్ కోర్టుకు తెలిపింది. దీంతో నిన్న రాత్రి నుంచే హిందువులు అక్కడకు చేరుకున్నారు. 30 ఏళ్ల తర్వాత జ్ఞానవాపిలో సీలు వేసి ఉన్న భూగర్భ గృహంలో స్థానిక పూజారి కుటుంబం గురువారం పూజలు (Pooja) నిర్వహించింది. 1991 డిఆసెంబర్ 6న అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చిన తర్వాత 993లో జ్ఞానవాపిలోని హిందూ దేవతలు ఉన్న ప్రాంతాన్ని అప్పటి యూపీ ముఖ్యమంత్రి ములాయమ్ సింగ్ (Mulayam Singh) ఆదేశాలతో సీల్ చేశారు.

Also read:Budget today:57 నిమిషాల మధ్యంతర బడ్జెట్…ఇప్పటివరకు ఇదే అత్యంత చిన్నది

మసీదు దగ్గరలో మందిర్ అనే బోర్డు..
జ్ఞానవాపి నేలమాళిగలో ఉన్న వ్యాప్ కా టెఖానా దగ్గర హిందువులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. రాష్ట్రీయ హిందూ దళ్ సభ్యులు మసీదుకు దగ్గర్లో మందిర్ అనే బోర్డు కూడా రాసి పెట్టారు. ఈరోజు తెల్లవారు ఝాము 3గంటలకు బ్రహ్మముహూర్తంలో పూజలను ప్రారంభించారు. దీని కోసం రాత్రి నుంచే మిందువులు అక్కడకు చేరుకోవడంతో ఎటువంటి అవాంఛనీయ సవఘటనలూ జరగకుండా వారణాసి పోలీసులు బారీగా భద్రతా బలగాలను మోహరించారు.

బేస్‌ మెంట్‌లోనే ఉంటున్న పూజారుల కుటుంబం..
జ్ఞనవాపి మసీదు (Gyanvapi Mosque) నాలుగు బేస్‌మెంట్‌లోని ఒక దానిలో పూజారుల కుటుంబం ఎప్పటి నుంచో నివాసం ఉంటోంది. 1993లో సీలు వేయడానికి ముందు నుంచి సోమనాథ్ వ్యాస్ అనే పూజారుల కుటుంబం నేలమాళిగలో నివసిస్తున్నారు. ఈ కుటుంబానికి చెందిన వ్యక్తే శైలేంద్ర పాఠక్... ఇక్కడ పూజలు చేయడానికి అనుమతినివ్వాలంటూ కోర్టులో పిటిషన్ వేశారు. అతని పిటిషన్‌లో ప్రకారం వంశపార్యంపర అర్చకులుగా ఉంటున్న తమ కుటుంబసభ్యులు నిర్మాణంలోకి ప్రవేవించి పూజలు చేయడానికి అనుమతివ్వాలని వాదించారు.

ఇదిలా ఉంటే హిందువులు పూజలు చేసుకోవచ్చు అంటూ వారణాసి కోర్టు (Varanasi Court) ఇచ్చిన ఆదేశాలను అలహాబాద్ హైకోర్టులో సవాల్ చేస్తామని చెబుతోంది మసీదు కమిటీ. రాజకీయ ప్రయోజనాల కోసమే ఇదంతా చేస్తున్నారని...బాబ్రీ మసీదు విషయంలో అనుసరించిన విధానాలనే ఇక్కడ అవలంబిస్తున్నారని అంటున్నారు మసీదు కమిటీ తరుఫు న్యాయవాది మొరాజుద్దీన్ సిద్ధిఖీ.

Advertisment
తాజా కథనాలు