Himachal Pradesh: హిమాచల్ ఉపఎన్నికల్లో సీఎం భార్య విజయం

హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని డెహ్రా అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన బై పోల్స్‌లో ఆ రాష్ట్ర సీఎం సుఖ్వీంద‌ర్ సింగ్ సుఖూ భార్య క‌మ‌లేశ్ ఘన విజయం సాధించారు. ఆమె త‌న ప్ర‌త్య‌ర్థిపై 9399 ఓట్ల తేడాతో నెగ్గారు. బీజేపీ అభ్య‌ర్థి హోషియార్ సింగ్‌పై ఆమె విక్ట‌రీ కొట్టారు.

New Update
Himachal Pradesh: హిమాచల్ ఉపఎన్నికల్లో సీఎం భార్య విజయం

Bypoll Elections: హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీ గట్టి షాక్ తగిలింది. ఇక్కడ జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి విజయం సాధించారు. సీఎం సుఖ్వీంద‌ర్ సింగ్ సుఖూ భార్య క‌మ‌లేశ్ ఘన విజయం సాధించారు. ఆమె త‌న ప్ర‌త్య‌ర్థిపై 9399 ఓట్ల తేడాతో నెగ్గారు. బీజేపీ అభ్య‌ర్థి హోషియార్ సింగ్‌పై ఆమె గెలిచారు.
తొలిసారి ఎన్నికల బరిలో దిగిన బీజేపీ అభ్యర్థి హోషియార్ సింగ్ ని ఓడించారు. మొత్తం 9 వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు.

మరోవైపు హిమాచల్ ప్రదేశ్ లోని మూడు స్థానాలకు ఉపఎన్నిక జరగగా కాంగ్రెస్ రెండు చోట్ల, బీజేపీ ఒక చోట విజయం సాధించింది. నలాగఢ్ స్థానం నుంచి కాంగ్రెస్ నేత హర్దీప్ బవా విజయభేరి మోగించారు. బీజేపీ అభ్యర్థి కేఎల్ ఠాకూర్ పై 8,990 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అయితే హమీర్ పూర్‌లో కాంగ్రెస్, బీజేపీ మధ్య గట్టి పోటీ జరిగింది. బీజేపీ అభ్యర్థి ఆశిష్ శర్మ కాంగ్రెస్ అభ్యర్థి పుష్పేందర్ వర్మపై గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థిపై 1,571 ఓట్ల మెజార్టీతో ఆశిష్ శర్మ గెలుపొందారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి గట్టిపోటీనిచ్చిన ఇండియా కూటమి ఏడు రాష్ట్రాల్లో జరిగిన 13 ఉపఎన్నికల్లోనూ సత్తా చాటింది.

Also Read:PM Modi: శుభ్ ఆశీర్వాద్ అందించిన ప్రధాని మోదీ

Advertisment
తాజా కథనాలు