PM Modi: శుభ్ ఆశీర్వాద్ అందించిన ప్రధాని మోదీ అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వేడుకలకు ప్రధాని మోదీ హాజరయ్యారు. నూతన దంపతులను ఆశీర్వదించారు. దాంతో పాటూ అక్కడకు వచ్చిన వారినందరినీ పేరుపేరునా పలకరించారు. By Manogna alamuru 14 Jul 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి PM Modi: అంబానీ ఇంట ప్రధాని మోదీ సందడి చేశారు. శుభ్ ఆశీర్వాద్ వేడుకలో మోదీ అనంత్ అంబానీ-రాధికా మర్చంట్లను మోదీ ఆశీర్వాదాలు అందించారు. ముందు ప్రధానికి ముకేశ్ అంబానీ, నీతా అంబానీలు ప్రధానికి స్వాగతం పలికారు. అంతకుముందు ముంబయ్‌లో రూ.29 వేల కోట్లతో చేపట్టనున్న ఆయా అభివృద్ధి ప్రాజెక్టుల శంకుస్థాపన, ఐఎన్ఎస్ టవర్స్ ప్రారంభోత్సవంలో మోదీ పాల్గొన్నారు. ఈరోజు జరిగిన శుభ్ ఆశీర్వాద్ వేడుకలోనూ సినీ, రాజకీయ, వ్యాపార, తదితర రంగాలకు చెందిన ప్రముఖులు సందడి చేశారు. మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ శిందే, ఉపముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ దంపతులు, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఆర్జేడీ చీఫ్ లాలూప్రసాద్ యాదవ్, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే తదితర రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. Your browser does not support the video tag. Also Read:Andhra Pradesh: ఒంగోలులో దారుణం..మత్తు ఎక్కించి విద్యార్ధిని చితకబాదిన వైనం #radhika-merchant #ananth-ambani #wedding #pm-modi మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి