Sukhvinder Singh : హిమాచల్‌ప్రదేశ్(Himachal Pradesh) ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు(Sukhvinder Singh Sukhu) రాజీనామా చేశారని వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా వీటిపై సుఖ్విందర్ సింగ్ స్పందించారు. తాను ఎవరికీ రాజీమానా లేఖ(Resign Letter) ను సమర్పించలేదని చెప్పారు. తన రాజీనామా గురించి బీజేపీ(BJP) వందతులు వ్యాప్తి చేస్తోందని దుయ్యబట్టారు. కాంగ్రెస్(Congress) ఐక్యంగా ఉంటుందని స్పష్టం చేశారు. అయితే హిమాచల్‌ప్రదేశ్‌లో మంగళవారం రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. దీంతో అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి.
Also Read: 3,300 కేజీల డ్రగ్స్ స్వాధీనం.. ఐదుగురు పాకిస్థానియులు అరెస్ట్
మెజార్టీ నిరూపిస్తాం
ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడటంతో.. బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. దీంతో కాంగ్రెస్ సర్కార్(Congress Sarkar) ప్రమాదంలో పడింది. అయితే సీఎం సుఖ్విందర్ సింగ్ రాజీనామా చేసినట్లు బీజేపీ నేత జైరాం ఠాకూర్ ఆరోపణలు చేశారు. దీంతో ఇది రాజకీయంగా సంచలనం రేపింది. దీనిపై స్పందించిన సుఖ్విందర్ సింగ్ తాను రాజీనామా చేయలేనని స్పష్టం చేశారు. అంతేకాదు బడ్జెట్ సెషన్‌లో తమ మెజార్టీని నిరూపిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
సంక్షోభంలో కాంగ్రెస్
ఇదిలా ఉండగా హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్రలు చేస్తున్నట్లు జోరుగా ప్రచారాలు నడుస్తున్నాయి. అలాగే మోదీ సర్కార్(Modi Sarkar).. అక్కడి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనాలని ప్రయత్నాలు చేస్తోందని విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందింది. ఇప్పటికే ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి బీజేపీ కండువ కప్పుకున్నారు. అలాగే మరో ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా మద్దతు తెలిపారు. అంతేకాదు బీజేపీలో చేరేందుకు మరో ఐదుగురు ఎమ్మెల్యేలు కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమయంలోనే సీఎం సుఖ్విందర్ సింగ్ రాజీనామా చేసినట్లు వార్తలు గుప్పుమన్నాయి.
మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం అస్తిత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న వేళ ట్రబుల్ షూటర్‌ను రంగంలోకి దింపనున్నట్లు సమాచారం. ఇందుకోసం హుడా, శివకుమార్‌లు సిమ్లాకు చేరుకోనున్నారు. హిమచల్‌ప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కూడా.. తన ఛాంబర్‌లో గందరగోళం చేసిన 15 మంది బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు.
Also Read: జన సందోహం.. రూ.17,300 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించిన మోదీ!