Telangana : ఇల్లందులో టెన్షన్.. మున్సిపాలిటీలో అవిశ్వాస పరీక్ష

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపల్ ఛైర్మన్ దుమ్మాలపాటి వెంకటేశ్వర్లుకు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం పెట్టింది బీఆర్ఎస్. దీన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. దీంతో ఇల్లందులో హైటెన్షన్ నెలకొంది.

New Update
Telangana : ఇల్లందులో టెన్షన్.. మున్సిపాలిటీలో అవిశ్వాస పరీక్ష

Bhadradri Kothagudem District : ఇల్లందు(Yellandu) లో మున్సిపల్ ఛైర్మన్ అవిశ్వాసం ఉద్రిక్తతలకు దారి తీసింది. బీఆర్ఎస్(BRS) పెట్టిన ఈ అవిశ్వాస తీర్మానాన్ని కాంగ్రెస్ అడ్డుకోవాలని చూస్తోంది. గతంలో కూడా రెండుసార్లు దీన్ని పెట్టినప్పటికీ అప్పుడున్న అధికార పార్టీ అవిశ్వాసం కౌన్సిల్‌లో చర్చకు రాకుండా చేసింది. కానీ మళ్ళీ ఇప్పుడు పెట్టడంతో జిల్లా కలెక్టర్ అవిశ్వాసం మీద చర్చకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో మరికొద్దిసేపట్లో డి. వెంకటేశ్వర్రావు మీద అవిశవాస ఓటింగ్ జరగనుంది. 24 కౌన్సిలర్ ఎమ్మెల్యే కో ఆప్షన్‌తో కలుపుకుని 25 మంది వార్డు సభ్యులు ఉండగా అందులో 17 మంది హాజరయితేనే కోరం పూర్తయినట్లు. ఇందులో ఒక్కరు తగ్గినా వీగిపోయినట్లే.

Also Read : Visakhapatnam : కొలిక్కి వస్తున్న విశాఖ ఎమ్మార్వో రమణయ్య హత్య కేసు

పొగులేటి vs కేటీఆర్..

అయితే ఈ అవిశ్వాసం వీగిపోయేలా అధికార కాంగ్రెస్(Congress) ప్రయత్నాలు చేస్తోంది. దీని కోసం మంత్రి పొంగులేటి శ్రీనివాస్(Ponguleti Srinivasa Reddy) శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అసమ్మతి కౌన్సిలర్లతో ఇప్పటికే పలుమార్లు ఎమ్మెల్యే కోరం కనకయ్య సహా పొంగులేటి దూతలు మంతనాలు జరిపారు. మరోవైపు అవిశ్వాసం నెగ్గేలా బీఆర్ఎస్ నేత కేటీఆర్(KTR) వ్యూహరచన చేస్తున్నారు. దీంతో ఇది పొంగులేటి, కేటీఆర్‌ల మధ్య వార్‌లా అయిపోయింది. ఇక అవిశ్వాసానికి నోటీసు ఇచ్చిన 17మందిలో కొద్దిమందిని రాకుండా చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. గోవా క్యాంపులో ఉన్న కౌన్సిలర్లు రాకుండా ఉండేందుకు పోలీస్ యంత్రాంగాన్ని రంగంలోకి దించారు.

అంతా గోవా నుంచే..

ప్రస్తుతం గోవా క్యాంపు(Goa Camp) లో ఉన్న కౌన్సిలర్లు... అక్కడ నుంచే నేరుగా అవిశ్వాస పరీక్షకు హాజరుకానున్నారు. అవిశ్వాసం నేపథ్యంలో అధికార పార్టీ ప్రలోభాలు, బెదిరింపులకు దిగుతుందంటూ ఆరోపిస్తున్నారు. గతంలోనే పలువురు కౌన్సిలర్లు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కౌన్సిల్ సభ్యులకు రక్షణ కల్పించాలని పోలీస్ శాఖకు ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. దీంతో పోలీస్ శాఖ ఇల్లందులో జాగ్రత్త చర్యలు చేపట్టింది. అక్కడ 144 సెక్షన్ అమలు చేస్తోంది. దీంతో ఎప్పుడు ఏమవుతుందో అంటూ ఇల్లందు ప్రజలు టెన్షన్ పడుతున్నారు.

Also Read : మైలవరం టికెట్ ఎవరికీ.. దేవినేని VS వసంత కృష్ణ ప్రసాద్

ఇల్లందు మున్సిపాలిటీ అవిశ్వాసంలో హైడ్రామా
ఇక బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే హరిప్రియను గదిలో బంధించారు పోలీసులు. హైకోర్టు ఆదేశాలను లెక్కచేయకుండా పోలీసుల ఓవరాక్షన్ చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆపోపిస్తున్నారు. దాంతో పాటూ బీఆర్ఎస్ కౌన్సిలర్‌ను కాంగ్రెస్‌ నేతలు ఎత్తుకెళుతుంటే చోద్యం చూస్తూ కూర్చున్నారని మండిపడుతున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు 144 సెక్షన్ మఅలు చేయడం లేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటివరకు 15 మంది కౌన్సిలర్లు సమావేశంలో పాల్గొన్నారు. అవిశ్వాసం వీగేందుకు కావలసిన సంఖ్య 17. ఆర్డీవో ముందు 15 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. మిగతా వారి కోసం కొంత సమయం ఇవ్వాలని వారు కోరుతున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు