Russia-Ukraine War: రష్యా - ఉక్రెయిన్ సరిహద్దుల్లో హై అలెర్ట్‌..

రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం మరింత ముదురుతోంది. ఇప్పటికే కర్స్క్‌ ప్రాంతంలో కొంత భాగాన్ని ఆక్రమించిన ఉక్రెయిన్ సేనలు మరింత ముందుకు సాగుతున్నాయి. దీంతో బెల్గొరాడ్‌లో రష్యా ఎమర్జెన్సీ విధించింది. అలాగే రష్యన్‌ అధికారులు పలు ప్రాంతాల్లో నివసించే ప్రజలను వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారు.

New Update
Russia-Ukraine War: రష్యా - ఉక్రెయిన్ సరిహద్దుల్లో హై అలెర్ట్‌..

రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం భీకర స్థాయికి చేరింది. సరిహద్దులోని బెల్గొరోడ్‌పై ఉక్రెయిన్‌ సైన్యం కన్నుపడింది. ఇప్పటికే కర్స్క్‌ ప్రాంతంలో కొంత భాగాన్ని ఆక్రమించిన ఉక్రెయిన్ సేనలు మరింత ముందుకు సాగుతున్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో బెల్గొరాడ్‌లో రష్యా ఎమర్జెన్సీ విధించింది. మరోవైపు రష్యా వైపు ఉక్రెయిన్ సైన్యం కదులుతోంది. దీంతో రష్యన్‌ అధికారులు పలు ప్రాంతాల్లో నివసించే ప్రజలను వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత రష్యాలోకి ఇతర దేశాల సైన్యం ప్రవేశించడం ఇదే తొలిసారి.

Also Read: ఇజ్రాయెల్‌పై దాడులు.. రంగంలోకి ఇరాన్‌ !

మరోవైపు బ్రయాన్స్క్‌, బెల్గొరాడ్‌, కర్స్క్‌ ప్రాంతాల్లో ఉన్న భారతీయులకు మాస్కోలో ఉన్న భారత రాయబార కార్యాలయం అప్రమత్తం చేసింది. ఇటీవల చోటుచేసుకుంటున్న భద్రతా సంఘటనల దృష్ట్యా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. తాత్కాలికంగా ఈ ప్రాంతాల నుంచి దూరంగా వెళ్లిపోవాలంటూ సూచలను చేసింది.

Also Read: సుంకిశాల ప్రమాదం.. మేఘా కంపెనీకి షాకిచ్చిన ప్రభుత్వం

ఇదిలాఉండగా.. రష్యాకు చెందిన 100 మంది సైనికులను బందీలుగా చేసుకున్నామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. తమ పిల్లలు సొంతిళ్లకు చేరుకునేందుకు ఈ పరిణామం దోహదపడుతుందని పేర్కొన్నారు. ఇప్పటికే 74 నివాస ప్రాంతాలను తమ ఆధినంలోకి వచ్చాయని.. అలాగే వందలాది మంది రష్యన్ సైనికులు తమ సైన్యం ముందు లొంగిపోయారని స్పష్టం చేశారు.

Advertisment
తాజా కథనాలు