Andhra Pradesh: ఎన్నికల వేళ.. ఏపీలో అనేక చోట్ల రచ్చ రచ్చ..!

ఆంధ్రప్రదేశ్‌లో చాలచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ పోలింగ్ ప్రక్రయికు ఆటంకం కలిగిస్తున్నారు. మరికొన్ని చోట్ల కరెంట్ లేకపోవడం, పోలింగ్ సిబ్బంది పని చేయమని బైఠాయించడంతో ఘర్షణలు జరిగాయి.

New Update
Andhra Pradesh: ఎన్నికల వేళ.. ఏపీలో అనేక చోట్ల రచ్చ రచ్చ..!

ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ ఎంత చురుగ్గా సాగుతోందో...ఘర్షణలు, గొడవలు కూడా అదే లెవల్లో కొనసాగుతున్నాయి. అనంతపురం గుత్తిలో హై టెన్షన్ నెలకొంది. టీడీపీ వైసీపీ నేతల దాడులు చేసుకున్నారు. పోలింగ్ కేంద్రంలో ప్రచారం నిర్వహించారని.. టీడీపీ నేతలపై వైసీపీ దాడి నేతలు అటాక్ చేశారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను అక్కడి నుంచి పంపించివేసారు.

శ్రీకాకుళం జిల్లాలో కూడా తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పొందూరు మండలం, గోకర్లపల్లిలో టెన్షన్ వాతాతవరణం నెలకొంది. టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ జరిగింది. పోలింగ్ బూత్ లో ఇరువర్గాల పరస్పరం దాడి చేసుకున్నారు. వైసీపీకి ఏజెంట్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. అతనిని వెంటనే రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఇరు వర్గాలకు చెందిన పలువురికి స్వల్ప గాయాలు అయ్యాయి. దీంతో అక్కడ కాసేపు పోలింగ్ ప్రక్రియ నిలిచిపోయింది.

పిఠాపురంలో పోలింగ్ బూత్‌ నంబర్‌ 153లో పవర్ కట్ కారణంగా పోలింగ్ నిలిచిపోయింది. ఈవీఎంలలో గుర్తులు కనిపించడం లేదని ఓటర్ల ఆందోళన వ్యక్తం చేశారు. చీకట్లోనే పోలింగ్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.

అనకాపల్లి జిల్లాలో.. పాయకరావుపేటలో ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించారు వైసీపీ అభ్యర్థి జోగులు. తిమ్మాపురంలో 246 బూత్ లో ఓటు హక్కును వినియోగించుకున్న కంబాల జోగులు..పోలింగ్ బూత్ వద్దకు వైసీపీ జెండాతో వచ్చారు. దీనికి జనసేన నేత బోడపాటి శివదత్ అభ్యంతరం చెప్పారు. తరువాత జెండా జోగులు జెండీ తీసేసినప్పటికీ..పోలింగ్ బూత్ దగ్గర కాసేపు ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటన మీద వైసీపీ మీద ఈసీకి జనసేన ఫిర్యాదు చేసే యోచనలో ఉంది.

ఇక హిందూపురంలో కూడా ఘర్షణ వాతావరణం నెలకొంది. చిలమత్తూరు మండలం వీరాపురంలో.. వైసీపీ టీడీపీ వర్గీయుల మధ్య గొడవ అయింది. వైసీపీ ఎంపీపీ పురుషోత్తం రెడ్డి కారుపై దాడి చేశారు. ఇందులో ఇరు వర్గాల్లో పలువురికి గాయాలు అయ్యాయి.

కడప జిల్లా రైల్వే కోడూర్‌ నియోజవర్గంలో..పుల్లంపేట మండలం పాపకగారిపల్లిలో.. టీడీపీ, జనసేన ఏజెంట్లపై దాడి చేశారు. దీంట్లో చాలామందికి గాయాలయ్యాయి. వారిని వెంటనే హాస్పటిల్‌కు తరలించారు. వైసీపీ వాళ్లే దాడి చేశారని బాధితులు అంటున్నారు.

గుంటూరు జిల్లా మాచర్లలో ఉద్రిక్తత నెలకొంది. వెల్దుర్తి మండలం గొట్టిపాళ్లలో టీడీపీ,వైసీపీ వర్గాల మధ్య దాడులు జరిగాయి. పోలింగ్‌ బూత్‌ దగ్గర టీడీపీ నేతలపై వైసీపీ నేతలు దాడి చేశారు. దాచేపల్లి మండలం భట్రుపాలెంలో ఓటింగ్‌పై గొడవ అయింది.

అనకాపల్లి జిల్లా, యలమంచిలి నియోజకవర్గ పరిధిలో అచ్యుతాపురం మండలం మోసయ్యపేట గ్రామంలో గల 191 192 పోలింగ్ బూతుల వద్ద ఉద్రిక్తత నెలకొంది. 191 పోలింగ్ బూత్ లో ఉండే ఏజెంట్ల మధ్య ఘర్షణలు తలెత్తడంతో ఇటుకలతో కొట్టుకునే అంత స్థితికి చేరుకుంది. ఇక్కడ రెండు బూతులకు ఒకే ఒక్క పోలీసు ఉండడంతో పరిస్థితిని కంట్రోల్ చేయలేకపోయారు. ఆలస్యంగా పోలీసులు వచ్చి పరిస్థితిని చక్కిద్దేందుకు ప్రయత్నించారు.

కృష్ణాజిల్లా పెనమలూరులో కానూరు పరిధిలోని 30, 31, 32 కేంద్రాల దగ్గర టెన్షన్‌ నెలకొంది. అక్కడికి ఓటేయడానికి వచ్చిన మహిళలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో సరైన ఏర్పాట్లు చేయలేదని ఓటర్లు ఆందోళన చేపట్టారు. 4 పోలింగ్‌ కేంద్రాలకు ఒకే ఎంట్రీ, ఎగ్జిట్‌ కావడంతో...ఓటేసేందుకు జనం ఇబ్బంది పడుతున్నారు. పోలింగ్‌ కేంద్రం దగ్గర తోపులాట జరుగుతోంది. మరోవైపు ఒంగోలులో దర్శి మండలం బొట్లపాలెంలో ఘర్షణ చోటుచేసుకుంది. టీడీపీ, వైసీపీ శ్రేణుల ఒకరి మీద ఒకరు దాడులు చేసుకున్నారు. ఇందులో పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి.

తాడిపత్రిలో టెన్షన్‌ టెన్షన్‌. పాతకోట పోలింగ్‌ బూత్‌లో ఘర్షణ. వైసీపీ,టీడీపీ కార్యకర్తలు కొట్టుకున్నారు.  జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పోలింగ్‌ బూత్‌ దగ్గరకు చేరుకున్నారు. ఇరువర్గాలు భారీగా చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

పశ్చిమగోదావరి జిల్లా ఆచంటలో కొడమంచిలిలో  టీడీపీ, వైసీపీ శ్రేణులు ఒకరినొకరు కొట్టుకున్నారు.  పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసుల లాఠీఛార్జ్ చేశారు.

ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం మునగచర్లలో హైటెన్షన్.  ఎన్నికల PO ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తుల ఆందోళన చేశారు. వృద్ధులు ఓట్లు కుటుంబ సభ్యులకు అనుమతి ఇవ్వకుండా పిఓ ఓటు వేపిస్తూన్నారని  ఓటర్లు గోడవకు దిగారు. తమ కుటుంబ సభ్యుల ఓట్లు తాము కాకుండా అధికారులు వేస్తారా అని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుంచి 1050 ఓట్లకి కేవలం 30 ఓట్లే పోలవడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏక పక్షంగా వ్వవహారిస్తున్న వారిపై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు