Israel: ఇజ్రాయెల్‌ పై హెజ్బుల్లా రాకెట్ల వర్షం

మిడిల్ ఈస్ట్‌లో యుద్ధం రోజురోజుకూ ఎక్కువైపోతోందే తప్ప ఆగడం లేదు. ఇజ్రాయెల్‌‌–హమాస్‌ల మధ్య కాల్పుల విరమణకు అమెరికా ప్రయత్నిస్తూనే ఉంది కానీ..ఫలితం కనిపించడం లేదు. మరోవైపు ఇజ్రాయెల్ మీద హెజుబుల్లా ప్రతీకార దాడుల్లో భాగంగా 50 రాకెట్లతో విరుచుకుపడింది.

Israel: ఇజ్రాయెల్‌ పై హెజ్బుల్లా రాకెట్ల వర్షం
New Update

Israel-Hamas War: ఇజ్రాయెల్ మీద హెజ్బుల్లా రాకెట్లతో విరుచుకుపడుతోంది. నిన్న, ఇవాళ వందల సంఖ్యల్లో రాకెట్లను ప్రయోగించింది. తాజాగా 50 రాకెట్లను ప్రయోగించిందని తెలుస్తోంది. గోలన్‌ హైట్స్‌లోని ప్రైవేటు ఇళ్లపై రాకెట్ దాడులు జరిపినట్లు సమాచారం. దీంతో అక్కడ చాలా ఇళ్ళు ధ్వంసం అయ్యాయి. ఈ దాడిలో ఒకరు చనిపోగా..19మంది గాయపడ్డారు. రాకెట్ దాడులలో ఒక చోట గ్యాస్ లీక్ అయింది. దీని ద్వారా భారీ ప్రమాదాన్ని నిరోధించామని గోలన్ హైట్స్ అగ్నిమాపక విభాగం తెలిపింది.

మంగళవారం ఒక్కరోజే 200 రాకెట్లతో దాడి చేశామని హెజ్బులా తెలిపింది. ఇజ్రాయెల్–హెజ్బుల్లాల మధ్య దాదాపు 10నెలలుగా దాడులు జరుగుతూనే ఉన్నాయి. దీనిలో 500మంది లెబనాన్ ప్రజలు చనిపోయారు. వీరిలో ఎక్కువ మంది మిలిటెంట్లే ఉన్నారు. వారితో పాటూ 100 మందికి పైగా సామాన్య పౌరులు, 23 మంది సైనికులు ఉన్నారు.

మరోవైపు ఇజ్రాయెల్–హమాస్ మధ్య కాల్పుల విరమణ కోసం అమెరికా ప్రయత్నిస్తోంది. దీని కోసం అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ చేస్తున్న ఈజిప్టు పర్యటన ముగిసింది. కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ ఒక ప్రతిపాదన చేసిందని...దానికి హమాస్ సమ్మతి తెలపాలని కోరామని బ్లింకెన్ చెప్పారు. అయితే ఇజ్రాయెల్ డిమాండ్స్ మీద హమాస్ విమర్శలు గుప్పించింది.

Also Read: Andhra Pradesh: ఎసెన్షియా కంపెనీలో ప్రమాదం..16చేరిన మృతుల సంఖ్య

#rockets #israel #attack #hezbollah
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe