Israel-Hamas War: ఇజ్రాయెల్ మీద హెజ్బుల్లా రాకెట్లతో విరుచుకుపడుతోంది. నిన్న, ఇవాళ వందల సంఖ్యల్లో రాకెట్లను ప్రయోగించింది. తాజాగా 50 రాకెట్లను ప్రయోగించిందని తెలుస్తోంది. గోలన్ హైట్స్‌లోని ప్రైవేటు ఇళ్లపై రాకెట్ దాడులు జరిపినట్లు సమాచారం. దీంతో అక్కడ చాలా ఇళ్ళు ధ్వంసం అయ్యాయి. ఈ దాడిలో ఒకరు చనిపోగా..19మంది గాయపడ్డారు. రాకెట్ దాడులలో ఒక చోట గ్యాస్ లీక్ అయింది. దీని ద్వారా భారీ ప్రమాదాన్ని నిరోధించామని గోలన్ హైట్స్ అగ్నిమాపక విభాగం తెలిపింది.
పూర్తిగా చదవండి..Israel: ఇజ్రాయెల్ పై హెజ్బుల్లా రాకెట్ల వర్షం
మిడిల్ ఈస్ట్‌లో యుద్ధం రోజురోజుకూ ఎక్కువైపోతోందే తప్ప ఆగడం లేదు. ఇజ్రాయెల్–హమాస్‌ల మధ్య కాల్పుల విరమణకు అమెరికా ప్రయత్నిస్తూనే ఉంది కానీ..ఫలితం కనిపించడం లేదు. మరోవైపు ఇజ్రాయెల్ మీద హెజుబుల్లా ప్రతీకార దాడుల్లో భాగంగా 50 రాకెట్లతో విరుచుకుపడింది.
Translate this News: