Israel-Hamas war:దాడులు మొదలెట్టిన హిజ్బుల్లా గ్రూప్..7గురు ఇజ్రాయెల్ సైనికులకు గాయాలు

హమాస్-ఇజ్రాయెలకు మధ్య జరుగుతున్న వార్ లో లెబనాన్ కు చెందిన హిజ్బుల్లా గ్రూప్ ఎంటర్ అయింది. ఇజ్రాయెల్ మీద రాకెట్లతో విరుచుకుపడింది. ఇందులో 7గురు సైనికులతో పాటూ 10 మంది ఇజ్రాయెల్ పౌరులకు గాయాలయ్యాయి.

New Update
Israel-Hamas War : ఇజ్రాయెల్ మీద క్షిపణి దాడి.. భారతీయుడి మరణం

ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఇరాన్ మద్దతు సమూహాలు దాడులకు దిగే ఛాన్స్‌లున్నాయని ఎప్పటి నుంచో చెబుతున్నారు. ఇప్పుడు అది నిజమవుతోంది. ఒకపక్క హమాస్-ఇజ్రాయెల్ మధ్య వార్ భీభత్సంగా నడుస్తూనే ఉంది. మరోవైపు నుంచి లెబనాన్ కు చెందిన హిజ్బుల్లా గ్రూప్ హమాస్‌కు మద్దతుగా ఇజ్రాయెల్ మీద దాడులను మొదలుపెట్టింది. ఆదివారం నాడు ఇజ్రాయెల్ సైన్యం మీద రాకెట్లతో విరుచుకుపడింది. ఇందులో ఏడుగురు ఇజ్రాయెల్ సైనికులు, మరో 10 మంది గాయపడ్డారు. ఇజ్రాయెల్ ఆర్మీ, రెస్క్యూ సర్వీసెస్ ఈ సమాచారాన్ని అందించాయి.

Also Read:ప్రచారంలో వేగం పెంచుతున్న బీజేపీ…16న మేనిఫెస్టో విడుదల

హమాస్-ఇజ్రాయెల్ మధ్య వార్ ఇతర ప్రాంతాలకు వ్యాపిస్తోంది అనడానికి హిజ్బుల్లా దాడులు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఈ విషయాన్న ఇస్వయంగా ఇజ్రాయెల్ మిటలరీనే ప్రకటించింది. మధ్యప్రాచ్యంలోని ప్రస్తుత యుద్ధం ఇతర సరిహద్దులలోకి చొచ్చుకుపోయే ప్రమాదం ఉందని ఇజ్రాయెల్ మిలటరీ ఆందోళన వ్యక్తం చేసింది. ఉత్తర ఇజ్రాయెల్‌లోని మనారా ప్రాంతంలో మోర్టార్ దాడిలో ఏడుగురు ఐడీఎఫ్ సైనికులకు గాయాలయ్యాయి. దాంతో పాటూ ఇజ్రాయెల్ రెస్క్యూ సర్వీసెస్ రాకెట్ దాడుల వల్ల 10 మంది పౌరులు గాయపడ్డారని, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు.

హిజ్బుల్లా గ్రూప్ 15 రాకెట్లను ప్రయోగించింది. వీటిలో ఇజ్రాయెల్ సైన్యం నాలుగింటిని కూల్చేసింది. గంటలోనే మొత్తం అన్ని రాకెట్లను హిజ్బుల్లా ప్రయోగించిందని ఙజ్రాయెల్ సైన్యం చెబుతోంది. ఈ దాడికి తామే బాధ్యులమని హిజ్బుల్లాకూడా ప్రకటిచింది. ఇజ్రాయెల్, అమెరికా దేశాలపై ఒత్తిడి తెచ్చేందుకు అంతర్జాతీయ ప్రదర్శనలకు హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా పిలుపు మేరకు ఈ కాల్పులు జరిగాయని హమాస్ తెలిపింది. ఒక రోజు తర్వాత సిరియా, ఇరాక్‌లలో మోహరించిన అమెరికా దళాలపై క్షిపణి, డ్రోన్ మీద కూడా దాడులు జరుగుతాయని చెబుతున్నారు. గాజాలో యుద్ధం ముగిసేవరకు ఇది కంటిన్యూ అవుతుందని ప్రకటించారు. మరోవైపు  హమాస్ సైనిక విభాగం ఉత్తర హైఫా, దక్షిణ లెబనాన్ నుండి ఇజ్రాయెల్ సరిహద్దు పట్టణాలైన నౌరా మరియు ష్లోమీపై దాడులు చేసింది. మొత్తానికి ఇజ్రాయెల్ ను ముప్పేట చుట్టుముట్టి దాడులు చేయాలని హమాస్, దాని మద్దతు గ్రూప్ లు ప్లాన్ చేస్తున్నాయి.

Also read:ఎన్నికల గేమ్ షురూ చేసిన జలగం..కొత్త గూడెంలో ఉత్కంఠత

Advertisment
తాజా కథనాలు