Heroins Fitness trainers salary: సినిమా వరల్డ్..అదో రంగు ప్రపంచం. ఇక్కడ ఉండాలంటే...ఎక్కువ కాలం నిలబడగలగాలి అంటే చాలా చేయాలి. హీరోలైనా, హీరోయిన్లు అయినా ముఖ్యంగా తమ అందాన్ని కాపాడుకోవాలి. శరీరాన్ని సౌష్టవంగా, ధృఢంగా ఉంచుకోవాలి. హీరోలకు కాస్త వెసులుబాటు ఉన్నా హీరోయిన్లకు మాత్రం అస్సలు ఉండదు. ఇండస్ట్రీ ఏదైనా ఒకటే రూల్. హీరోయిన్ అంటే సన్నగా, నాజూగ్గా ఉండాలి. పూర్వం సావిత్రి వాళ్ళల్లా ఇప్పుడు బండగా ఉంటే ఎవ్వరూ చూడడ్ం లేదు. దీని బెస్ట్ ఉదాహరణ మన అనుష్క శెట్టినే. ఒక సినిమా కోసం లావు అయ్యి తగ్గకపోవడంతో ఇప్పుడు దాదాపుగా ఆమెకు అవకాశాలు లేకుండా పోయాయి. అందుకే హీరోయిసన్లు ఎప్పుడూ తమ ఫిట్నెస్ను కాపాడుకుంటుంటారు. దాని కోసం తిండ ఇమానేయడమే కాకుండా..బోలెండత శ్రమ పడుతుంటారు. అంతే డబ్బులు ఖర్చు కూడా పెడుతుంటారు.
హీరోయిన్ల ఫిట్నెస్ విషయానికి వస్తే...మన దగ్గర కన్నా బాలీవుడ్లో చాలా పర్టిక్యులర్‌గా ఉంటారు. దీని కోసం తెగ కష్టపడుతుంటారు. అలా ఉంటేనే ఎక్కువ కాలం ఇండస్ట్రీలో ఉంటారు. లేకపోతే మూడు, నాలుగు సినిమాలకే షెడ్డుకి వెళ్లిపోవడం పక్కా. అయితే కొంతమంది బ్యూటీలు మాత్రం పెళ్లయినా సరే గ్లామర్‌లో, ఫిట్‌నెస్‌లో ఏమాత్రం తగ్గేదేలే అనిపిస్తున్నారు. దీని కోసం వీళ్ళు పెట్టే ఖర్చు కూడా లక్సలు, కోట్లలో ఉంటుంది. మరి అలాంటి హీరోయిన్లో తమ ఫిట్నెస్ ట్రైనర్‌కు ఎవరెవరు ఎంతెంత శాలరీలు ఇస్తున్నారో మీకు తెలుసా...
మలైకా అరోరా..
బాలీవుడ్ ఐటెం బాంబ్...మలైకా ఆరోరా. ఈమె చేసిన సినిమాలు చాలానే తక్కువ. గట్టిగా వేళ్ళ మీద లెక్క పెట్టేయొచ్చు. కానీ ఎప్పుడూ మలైకా లైమ్‌లైట్‌లో ఉంటుంది. దానికి కారణం ఆమె ఫిట్నెస్. 50 ఏళ్ళ వయసులో ప్రస్తుతం మలైకా హాట్చిక్లా ఉందంటే కారణం దానికి ఆమె తన శరీరం మీద తీసుకునే శ్రద్ధే కారణం. ప్పటికీ కిక్ ఎక్కించే అందాలతో రెచ్చగొడుతోంది మలైకా. మిగిలిన హీరోయిన్లు కూడా అసూయ పడేంత ఆకర్షణీయమైన శరీరాకృతి మలైకా సొంతం. మలైకా అరోరా రోజూ జిమ్‌కు వెళుతుంది. తన షెడ్యూల్ ఎలా ఉన్నా జిమ్ మానేసేదే లేదు . యోగా, జిమ్, వర్కౌట్లు...వాట్ నాట్..అన్ని చేస్తూ ఫిట్‌గా ఉంటుంది. దీని కోసం ఈమె నెలకు దాదాపుగా 80 నుంచి 90 వేల వరకు ఖర్చు చేస్తుంది. మలైకా తన సొంత ఫిట్నెస్ ట్రైనర్ దగ్గరే రోజూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది.
కరీనా కపూర్..
కరీనా కపూర్ వయసు 43 ఏళ్ళు. ఇద్దరు పిల్లలు. కానీ చిన్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడుకూడా అలానే ఉంది. డెలివరీల తర్వాత అందరిలాగే వెయిట్ పెగిరిన కరీనా తర్వాత మళ్ళీ తగ్గిపోయింది. ఈ ఫిట్ లుక్‌లోకి రావడానికి కరీనా నెలకు తన ఫిట్నెస్ ట్రైనర్‌కు 70 వేలు ఇస్తుంది. దాంతో పాటూ కరీనా డైటీషియన్‌ను కూడా పెట్టుకుంది. అది కూడా రుజుతా దివాకర్ లాంటి ఫేమస్ డైటీషయన్.
దీపికా పడుకోన్...
అసలు దీపికా పడుకోన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. మామూలుగానే ఈమెకు పిట్నెస్ మీద స్పృహ ఎక్కువ. స్వతహాగా క్రీడాకారిణి అవడంతో ఆమె తన బాడీ మీద ముందు నుంచే శ్రద్ధ పెట్టింది. సినిమాల్లోకి వచ్చాక మరింత స్లిమ్ అండ్ బ్యూటీలా తయారయింది. ఎన్నో అంతర్జాతీయ అవార్డు వేడుకల్లో భారత ప్రతినిధిగా మెరిసిన దీపికా కూడా యోగా, జిమ్ అంటూ ఎప్పుడూ తెగ కష్టపడుతూ ఉంటుంది. తన ఫిట్నెస్ను కాపాడే ట్రైనర్‌కి నెలకి రూ.60,000 వరకూ ఇస్తోంది.
శిల్పాశెట్టి...
అందరికన్నా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఈమె గురించే. యోగా అంటే శిల్పా...శిల్పా అంటే యోగా అన్న రేంజ్‌కు వెళ్ళిపోయింది ఈ బాలీవుడ్ ఓల్డ్ హీరోయిన్. తయోగాతో తాను స్లిమ్‌గా, ఫిట్‌గా ఉండడమే కాకుండా అందరికీ క్లాస్‌లు చెబుతూ ఫేమస్ అయింది. శిల్పా శెట్టికి ఎంత తిండి పిచ్చి ఉందో అంతే ఫుడ్ కంట్రోల్ కూడా ఉంది. ఫిట్‌గా ఉండాలనుకునే వారికి శిల్పా ఒక ఐకాన్.
ఆలియా, జాన్వీ, రకుల్..
వీళ్ళందరూ కూడా రోజూ జిమ్‌కు వెళ్ళందే రోజు గడవదు. ఎన్ని షూటింగ్‌లు ఉన్నా ఎక్సర్సైజ్ దానికి తగ్గ డైట్ తీసుకోవాల్సిందే. ఫిట్‌గా ఉండడం కోసం దాదాపు వీళ్ళు తిండిని త్యాగం చేసేస్తారు. మనలా అన్ని రకాలు తినకుండా చాలా కాలిక్యులేటెడ్‌గా, తకకువ తింటే ఉంటారు. వీళ్ళు కూడా తమ ఫిట్నెస్ ట్రైనర్లకు 50వేలకు తక్కవు కాకుండా జీతాలు ఇస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ అయితే ఏకంగా జిమ్ సెంటర్లను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది.